'తెలంగాణకు స్వేచ్చ, స్వతంత్రం ఇచ్చింది సోనియానే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని కేంద్రమంత్రి మునియప్ప తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే అని మునియప్ప అన్నారు.
రైల్వేశాఖామంత్రిగా తెలంగాణకు 15వేల కోట్ల రూపాయలను కేటాయించానని మునియప్ప తెలిపారు. రైల్వే లైన్లు అభివృద్ధి చేయడమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి కొత్త రైళ్లను కేటాయించామన్నారు.
తెలంగాణ ప్రాంతంలో అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కర్ణాటకలో 28 ఎంపీ సీట్లలో 20 కాంగ్రెస్ గెలుస్తుందని మునియప్ప ధీమా వ్యక్తం చేశారు.