KH Muniyappa
-
విజయానికి మారు పేర్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గుకురావడం అంత తేలికయిన విషయమేమీ కాదు. కానీ, కొందరు రాజకీయ నేతలు గెలుపునే అలవాటుగా మార్చుకున్నారు. పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇంత ఈజీయా అనుకునేలా దశాబ్దాలపాటు కొనసాగారు. కొందరు ఇంకా కొనసాగుతున్నారు. ఉదాహరణకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. బీజేపీకి చెందిన ఈమె ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా, కాంగ్రెస్‌కు చెందిన కె.హెచ్.మునియప్ప కర్ణాటకలోని కోలార్ నియోజకవర్గం నుంచి ఏకంగా ఏడుసార్లు క్రమం తప్పకుండా ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా 8వసారీ బరిలో నిలిచారు. వీరందరినీ మించి ఇంద్రజిత్ గుప్తా 11 పర్యాయాలు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర భారతంలో లోక్‌సభ సభ్యులుగా అప్రతిహతంగా కొనసాగిన, కొనసాగుతున్న కొందరు హేమాహేమీల వివరాలివీ.. ఇంద్రజిత్ గుప్తా, మనేకా గాంధీ, కమల్ నాథ్ -
'తెలంగాణకు స్వేచ్చ, స్వతంత్రం ఇచ్చింది సోనియానే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని కేంద్రమంత్రి మునియప్ప తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే అని మునియప్ప అన్నారు. రైల్వేశాఖామంత్రిగా తెలంగాణకు 15వేల కోట్ల రూపాయలను కేటాయించానని మునియప్ప తెలిపారు. రైల్వే లైన్లు అభివృద్ధి చేయడమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి కొత్త రైళ్లను కేటాయించామన్నారు. తెలంగాణ ప్రాంతంలో అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కర్ణాటకలో 28 ఎంపీ సీట్లలో 20 కాంగ్రెస్ గెలుస్తుందని మునియప్ప ధీమా వ్యక్తం చేశారు. -
ఈవీఎం వాస్తు బాగాలేదు
పోలింగ్ బూత్‌లో మునియప్ప వీరంగం కోలారు (కర్ణాటక), న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప పోలింగ్ కేంద్రంలో వీరంగం సృష్టించారు. మంత్రిగారా? మజాకా? అన్నట్లు... వాస్తు బాలేదంటూ పోలింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. మునియప్ప లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కోలార్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. గురువారం ఉదయం హారోహళ్లిలోని పోలింగ్ కేంద్రానికి సతీమణి, అనుచరులతో కలసి ఓటు వేసేందుకు వెళ్లారు. ఈవీఎం ఉత్తరం దిక్కున ఉందని, వాస్తు సరిగా లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుచరులతో ఈవీఎంను మరో స్థలంలోకి మార్పించారు. అనంతరం ఆయన ఓటేసిన తర్వాత దగ్గరుండి తన భార్యతో ఓటేయించారు. ఆ సమయంలో అనుచరులూ వారి వెనకే ఉన్నారు. దీంతో జిల్లా ఎన్నికల అధికారి డీకే రవి... పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారిని మార్చారు. -
హైదరాబాద్‌లో టెక్నికల్ వర్సిటీ: మునియప్ప
కోలారు(కర్ణాటక): ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు ప్రత్యేక శిక్షణనిచ్చే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని(టెక్నికల్ వర్సిటీ) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం కోలారులో కెనరా బ్యాంకు ఏర్పాటు చేసిన రుణ మేళాలో మంత్రి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిపుణులైన కార్మికులను రూపొందించేందుకుగాను హైదరాబాద్‌లో టెక్నికల్ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని చెప్పారు. వర్సిటీ ఏర్పాటుకు స్థలం ఇచ్చేందుకు ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. అత్యుత్తమ సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా సృజనాత్మకత కలిగిన నిపుణులు అందుబాటులోకి వస్తారన్నారు.