ఈవీఎం వాస్తు బాగాలేదు | union minister kh muniyappa created ravishing at polling station | Sakshi
Sakshi News home page

ఈవీఎం వాస్తు బాగాలేదు

Published Fri, Apr 18 2014 4:58 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

ఈవీఎం వాస్తు బాగాలేదు - Sakshi

ఈవీఎం వాస్తు బాగాలేదు

 పోలింగ్ బూత్‌లో మునియప్ప వీరంగం

కోలారు (కర్ణాటక), న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప పోలింగ్ కేంద్రంలో వీరంగం సృష్టించారు. మంత్రిగారా? మజాకా? అన్నట్లు... వాస్తు బాలేదంటూ పోలింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. మునియప్ప లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కోలార్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు.
 
గురువారం ఉదయం హారోహళ్లిలోని పోలింగ్ కేంద్రానికి సతీమణి, అనుచరులతో కలసి ఓటు వేసేందుకు వెళ్లారు. ఈవీఎం ఉత్తరం దిక్కున ఉందని, వాస్తు సరిగా లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుచరులతో ఈవీఎంను మరో స్థలంలోకి మార్పించారు.
 
అనంతరం ఆయన ఓటేసిన తర్వాత దగ్గరుండి తన భార్యతో ఓటేయించారు. ఆ సమయంలో అనుచరులూ వారి వెనకే ఉన్నారు. దీంతో జిల్లా ఎన్నికల అధికారి డీకే రవి... పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారిని మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement