
నేడు హిందూపురానికి రాహుల్ రాక
హిందూపురం, న్యూస్‌లైన్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అనంతపురం జిల్లాలోని హిందూపురం రానున్నారు. ఎంజీఎం మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను మంగళవారం కేంద్ర మంత్రి మునియప్ప పరిశీలించారు. సభ ఆలస్యమైతే ఇబ్బందులు తలెత్తకుండా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయించారు.