రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలంతా మూడు రాజధానుల ప్రతిపాదనపై మొగ్గు చూపుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారి కుంటాయని.. ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. గతాన్ని పరిశీలిస్తే.. రాజధానిగా ఉన్న మద్రాస్ కర్నూలుకి మారిందని.. అక్కడ నుంచి హైదరాబాద్‌కి తరలిందని వివరించారు.