
ప్రధానితో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం రాహుల్ గాంధీ సభలో ప్రవర్తించిన తీరును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుపట్టారు. ప్రధానిని కౌగిలించుకోవడం, మళ్లీ వచ్చి కన్ను కొట్టడం హుందాగా లేదన్నారు. ప్రధానితో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదన్నారు. ప్రధాని స్థానంలో ఎవరున్నా ఆ పదవిని గౌరవించడం ముఖ్యమని, ఇది సభ్యులందరికీ వర్తిస్తుందన్నారు. అధికార, విపక్ష సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.
రాహుల్ గాంధీ ఎంతో భవిష్యత్ ఉన్న నేతని, ఆయన తన కొడుకు లాంటి వాడంటూ రాహుల్ తప్పుల్ని ఎత్తిచూపడం తన బాధ్యతని స్పీకర్ అన్నారు. కాగా, విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు స్పీకర్ చురకలు వేశారు. సభలోలేని కొత్త సంప్రదాయాలను సభ్యులకు నేర్పిస్తున్నారని ఆయనపై మండిపడ్డారు.