
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు(బుధవారం) కొలువుదీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ రేస్‌లో సీనియర్లు పోటీ పడుతున్నారు.
కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు కూడా ఏడు సార్లు ఏడుసార్లు గెలిచిన ఎమ్మేల్యేలే.. గతంలో చంద్రబాబును రఘురామకృష్ణం రాజు.. స్పీకర్ పదవి అడగ్గా, 2014 ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడెల శివప్రసాద్‌కి చంద్రబాబు స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి అదే ఫార్ములా అనుసరిస్తారా? సామాజిక సమీకరణలు పాటించి బీసీ, ఎస్పీలకు ఇస్తారా?. గతంలో స్వీకర్ గా పని చేసిన అనుభవం ఉన్న నాదెండ్లకి మరోసారి అవకాశం కల్పిస్తారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ
మరోవైపు, చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. మంత్రుల జాబితా ఇంకా ప్రకటించలేదు. మంత్రి పదవి ఫోన్ల కోసం టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. రాత్రికి చంద్రబాబు నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. అమిత్ షా అనుమతి తర్వాతే మంత్రుల జాబితా వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment