ఇది గాంధీ, నెహ్రూ జమానా కాదు.. | No Conspiracy About Indian Muslims: Haryana BJP MLA | Sakshi
Sakshi News home page

‘ఆ జమానా కాదు.. మోదీ, షాల రాజ్యం’

Published Wed, Dec 25 2019 10:19 AM | Last Updated on Wed, Dec 25 2019 3:29 PM

No Conspiracy About Indian Muslims: Haryana BJP MLA - Sakshi

చండీగఢ్‌ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హర్యానా బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కైతాల్‌ ఎమ్మెల్యే లీలా రామ్‌ గుర్జార్‌ తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఏఏపై కొంతమంది ఆందోళన చేస్తూ మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇది గాంధీ, నెహ్రూ, మన్మోహన్‌సింగ్‌ల జమానా కాదు. ఇప్పుడు నడుస్తున్నది మోదీ, అమిత్‌షాల రాజ్యం. మాకు ఒక్క సిగ్నల్‌ వస్తే ఒక్క గంటలోనే వాళ్ల పనిపడతామని వ్యాఖ్యానించారు. సీఏఏపై మాట్లాడుతూ.. ఈ చట్టంతో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారనేది వాస్తవం కాదు. భారతీయ ముస్లింలకు ఈ చట్టంతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్రమంగా వచ్చిన విదేశీ చొరబాటుదారులు మాత్రం ఖచ్చితంగా దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేనన్నారు. చదవండివారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement