చండీగఢ్: హర్యానాలో ఈరోజు (శనివారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్నిచోట్ల చెదురుమదురు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మెహమ్ నుంచి పోటీ చేస్తున్న హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్‌రాజ్ కుందు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తనపై దాడి చేసి, తన బట్టలు చించేశారని ఆరోపించారు. దీనిపై వీడియో సందేశం ద్వారా ఆయన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
జన్ సేవక్ పార్టీ అభ్యర్థి బాల్‌రాజ్ కుందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ డాంగి తనపై దాడి చేశారని ఆరోపించారు. తాను, తన పీఏ రోహ్‌తక్ జిల్లాలోని ఒక బూత్‌కు వెళ్ళినప్పుడు మాజీ ఎమ్మెల్యే డాంగి దాడిచేశారని, తన దుస్తులను చింపేశారని కూడా ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ డాంగి ఓడిపోతారనే భయంతోనే అతని తండ్రి ఆనంద్ సింగ్ డాంగి ఈ దాడికి పాల్పడ్డారని బాల్‌రాజ్ కుందు ఆరోపించారు. హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్‌రాజ్ కుందు మెహమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆనంద్ సింగ్ డాంగి కుమారుడు బలరామ్ డాంగి ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి. ఇక్కడి నుంచి బీజేపీ తరపున దీపక్ హుడా పోటీ చేస్తున్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, దశాబ్దం తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది.
ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్
Comments
Please login to add a commentAdd a comment