
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): నేను కూడా దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలపాటు జైల్లో ఉన్నా అని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. జైల్లో ఏం దొరుకుతుంది, ఏమి దొరకదో బాగా తెలుసు. ఒక బీడీకి ఎంత డబ్బులివ్వాలో నాకు బాగా తెలుసన్నారు. బుధవారం చిక్కమగళూరు జిల్లా తరీకెరె జైలును తనిఖీ చేశారు.
జైల్లో సరిగా అన్నం వండి పెట్టడం లేదని కొందరు ఖైదీలు రాసిన లేఖ తనకు చేరిందన్నారు. ఆ లేఖ ఖైదీలు రాశారో లేక ఎవరు రాశారో తెలియదు. నా ఫోన్‌కు వచ్చిందని, జైల్లో చిన్నచిన్న తప్పులను గుర్తించినట్లు చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో జేహెచ్ పటేల్, డీహెచ్ శంకరమూర్తితో కలిసి జైలులో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment