Emergency situation
-
Karnataka: ఆరు నెలలు జైల్లో ఉన్నా: హోంమంత్రి
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): నేను కూడా దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలపాటు జైల్లో ఉన్నా అని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. జైల్లో ఏం దొరుకుతుంది, ఏమి దొరకదో బాగా తెలుసు. ఒక బీడీకి ఎంత డబ్బులివ్వాలో నాకు బాగా తెలుసన్నారు. బుధవారం చిక్కమగళూరు జిల్లా తరీకెరె జైలును తనిఖీ చేశారు. జైల్లో సరిగా అన్నం వండి పెట్టడం లేదని కొందరు ఖైదీలు రాసిన లేఖ తనకు చేరిందన్నారు. ఆ లేఖ ఖైదీలు రాశారో లేక ఎవరు రాశారో తెలియదు. నా ఫోన్‌కు వచ్చిందని, జైల్లో చిన్నచిన్న తప్పులను గుర్తించినట్లు చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో జేహెచ్ పటేల్, డీహెచ్ శంకరమూర్తితో కలిసి జైలులో ఉన్నట్లు తెలిపారు. చదవండి: Padmarajan Record: రాజాధిరాజన్ ఓడినా.. రికార్డే -
కిషోర్ కుమార్‌ను వదల్లేదు
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా పోరాడిన వారిని ప్రశంసిస్తూ...వారికి కృతజ్ఞతలు తెలపడం కోసం మంగళవారం ముంబైలో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1975 నాటి రోజులను గుర్తు చేస్తూ ఎమర్జేన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం జయప్రకాశ్ నారాయణ్ , వాజ్‌పేయ్, అద్వాణీ వంటి ప్రముఖ నాయకులనే కాక మీడియాను కూడా తీవ్రంగా అణచి వేసిందని విమర్శించారు. ఎమర్జేన్సీని సాకుగా ఉపయోగించుకుని అలనాటి ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చిందని మోదీ తెలిపారు. ఈ విషయం గురించి ‘ఎమర్జేన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఒక ర్యాలీ కోసం కిషోర్ కుమార్‌ను పాట పాడమని కోరారు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. అదే ఆయన చేసిన పెద్ద నేరం. దాంతో టీవీల్లో, రేడియోల్లో ఆయనను కనిపించకుండా, వినిపించకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాక ఆ సమయంలో ఆయన నేపధ్య గాయకుడిగా రూపొందించిన ‘ఆంధీ’(గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా) చిత్రాన్ని విడుదల కాకుండా నిషేధించింది. ఇది ఆ పార్టీ మనస్తత్వం’ అంటూ మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 1976 - 77 ఎమర్జేన్సీ కాలంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్న వీసీ శుక్లా కిషోర్ కుమార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. వీసీ శుక్లా అప్పట్లో ఇందిర గాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీకి చాలా సన్నిహితంగా ఉండేవాడు. -
సుప్రీం జడ్జీల అరెస్ట్.. ప్రజలు షాక్!
మాలే: హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన కొన్ని గంటల్లోనే చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో సీనియర్ జడ్జి జస్టిస్ అలీ హమీద్, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ కీలక నేతను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా సుప్రీం జడ్జీలనే అరెస్ట్ చేయడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ అనిశ్చితి కారణంగా 15 రోజులపాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ సోమవారం (ఫిబ్రవరి 5న) ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో ఇద్దరిని అరెస్ట్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏ కారణాలు, సెక్షన్ల కింద అరెస్ట్ చేశారో తెలపలేదు.. కానీ అరెస్ట్ విషయాన్ని ట్వీటర్ ద్వారా పోలీసులు వెల్లడించారు. రాజకీయ సంక్షోభానికి కారణాలివే... 9 మంది ప్రతిపక్ష నేతలను జైలు నుంచి విడుదల చేయాలని మాల్దీవుల సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించింది. ఇందుకు అధ్యక్షుడు యమీన్ నిరాకరించడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ యమీన్ ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశారు. జడ్జీలు తమ తీర్పుపై వెనక్కి తగ్గక పోవడంతో యమీన్ ఎమర్జెన్సీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రతా దళాలకు విశేషాధికారాలు సంక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో సీనియర్ జడ్జి జస్టిస్ అలీ హమీద్‌లను అరెస్ట్ చేసి మిగతా ఇద్దరు జడ్జీలు తమ తీర్పును మార్చుకోవాలని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లయింది. -
ముదిరిన సంక్షోభం.. మాల్దీవుల్లో ఎమర్జెన్సీ
-
మాల్దీవుల్లో అత్యవసర స్థితి
మాలే: రాజకీయ సంక్షోభం నెలకొన్న మాల్దీవుల్లో అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ సోమవారం అత్యవసర స్థితి విధించారు. దీంతో భద్రతా దళాలకు విశేషాధికారాలు సంక్రమిస్తాయి. అనుమానితులను వారు అరెస్ట్ చేయొచ్చు. నిర్బంధించొచ్చు. 15 రోజులపాటు అత్యవసర స్థితి అమలులో ఉంటుందని యమీన్ వ్యక్తిగత కార్యదర్శి అజిమా ప్రభుత్వ టీవీ చానల్ ద్వారా ప్రకటించారు. 9 మంది అసమ్మతి నేతలను జైలు నుంచి విడుదల చేయాలని మాల్దీవుల సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించడం, ఇందుకు యమీన్ నిరాకరిస్తున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ యమీన్ తాజాగా న్యాయమూర్తులకు లేఖ రాశారు. అత్యవసరమైతే తప్ప భారతీయులు కొన్నిరోజులు మాల్దీవులకు వెళ్లకూడదని భారత విదేశాంగ శాఖ సూచించింది. -
ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ లాలూ
పట్నా: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో ఎమర్జెన్సీ నాటి రోజులను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. 'ప్రధాని మోదీ ఏ విధమైన ప్రజాస్వామ్యాన్ని రూపొందిస్తున్నారు?' అంటూ లాలూ ఈ మేరకు ట్విట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మనోభావాలను విస్మరించరాదని ఆయన అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితుల తరహాలో కేంద్రం వ్యవహరిస్తోందని లాలూ ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు నిర్భందించటాన్ని లాలూ తప్పుపట్టారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని కేంద్రం టార్గెట్ చేసుకొని వేధింపులకు పాల్పడుతోందన్నారు. ప్రజల చేత ఎన్నకోబడ్డ ముఖ్యమంత్రిని అడ్డుకోవటం రాజ్యాంగాన్ని అతిక్రమించినట్లేనని లాలూ అన్నారు. -
సూర్యాపేట ఘటన బాధితుడికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాధపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గన్నమని దొరబాబు(46) కూకట్‌పల్లిలోని ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సెంటర్లో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో ఆయన గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం దొరబాబును గురువారం తెల్లవారు జామున కూకట్పల్లి ఐకాన్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన చేతిలో దిగబడిన బుల్లెట్‌ను వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికి తీశారు. ప్రస్తుతం దొరబాబుకు ఎటువంటి అపాయం లేదని డాక్టర్లు తెలిపారు. -
అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ సేవలు అంతంతే
ఇతర అవసరాలకే ఎక్కువగా వినియోగిస్తున్న వైనం సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబులెన్స్ ఇతర వైద్యసేవలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. దీంతో అత్యవసరమైనప్పుడు ఇవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ అంబులెన్స్ సేవలను అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఉపయోగించాలనే అవగాహన ప్రజల్లో లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు, విద్యుదాఘాతం తదితర ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు వెంటనే వైద్యసేవలు అందాలనే ఉద్దేశంతో నాలుగు నెలల కిందట 108 నంబర్‌తో అంబులెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.కాని ఈ నాలుగు నెలల కాలంలో అత్యవసర సేవలకంటే గర్భిణిలే ఎక్కువ శాతం ఈ సేవలను వినియోగించినట్లు రికార్డు చేసిన గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. వీరంతా పరీక్షల నిమిత్తం, ప్రసవానికి ఆస్పత్రులకు వెళ్లేందుకు అంబులెన్స్‌లను వినియోగించినట్లు తేలింది. కేవలం ఒక్క శాతం మాత్రమే గుండెపోటు వచ్చిన వ్యక్తి ఈ సేవలను వినియోగించినట్లు స్పష్టమైంది. నాలుగు నెలల కాలంలో 108 నంబర్‌కు సుమారు ఎనిమిది లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో 50 వేల కాల్స్ వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వెళ్లేందుకు వినియోగించినట్లు తెలిసింది. సుమారు లక్ష కాల్స్ కేవలం సమాచారం అడిగి తెలుసుకునేందుకే చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంబులెన్స్ సేవల గురించి అత్యధిక శాతం ప్రజలకు తెలిసేలా జనజాగృతి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సుజాత సోనిక్ చెప్పారు.దీంతో బస్‌స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో, బహిరంగ స్థలాల్లో అక్కడక్కడా ప్రజలను జాగృతం చేసే ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు సోనిక్ చెప్పారు. ఇప్పటిదాకా గుండె పోటుతో ఒక శాతం, ప్రమాదాలు 17 శాతం, గర్భిణీలు పరీక్షలు, ప్రసవానికి 24 శాతం, ఇతర కారణాలకు 57 శాతం వినియోగించుకున్నారు. -
నేడు 108 పెలైట్స్ డే
కోటపల్లి, న్యూస్‌లైన్ : అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు మెరు పు వేగంతో సంఘటన స్థలానికి నవ సంజీవనీని తీసుకెళ్తారు. విధి నిర్వహణలో ముందుండి ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ అతి త్వరగా ఆస్పత్రుల్లో చేర్చుతారు. వారికి ఏమీ కాకూడదని కోరుకుంటారు. సోమవారం ‘108 పెలైట్స్ డే’ సందర్భంగా పైలట్స్ అంది స్తున్న సేవలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం. సేవలకు గుర్తింపుగా పెలైట్స్ డే.. 108 అంబులెన్స్‌కు మొదటి ప్రాణం ఈఎంటీ ఐతే రెండో ప్రాణం పెలైట్. ఎలాంటి విపత్తు ఎ దురైనా ఈఎంటీ తక్షణమే స్పందిస్తారు. ప్రమా ద బాధితులకు వైద్య చికిత్స అందించి వారిని కాపాడేందుకు కృషి చేస్తారు. క్షణ కాలాన్ని కూ డా వృథా కానివ్వకుండా అత్యవసర సర్వీసైన 108 అంబులెన్స్‌ను సంఘటన స్థలానికి తీసుకెళ్లడం పెలైట్ బాధ్యత. అందుకే వీరిరువురు 108కు రెండు కళ్లలాంటివారిగా ఆ విభాగం ఉ న్నతాధికారులు బావిస్తుంటారు. అలాంటి వారి సేవలకు గుర్తింపునిచ్చేందుకు ప్రతీ సంవత్సరం మే26న 108 పెలైట్స్ డే జరుపుతుంటారు. బాధితులకు ఆప్తులుగా.. 108 అంబులెన్స్ సమయానికి సంఘటన స్థలానికి చేరడం, అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లడంలో ప్రతీ క్షణం విలువైందే. ప్రతీ క్షణానికి విలువని స్తూ 108 అంబులెన్స్ సేవలను ప్రతీ ఒక్కరికి తె లియపరుస్తున్న సిబ్బంది ప్రతీ ఒక్కరికి ఆప్తులే. పెలైట్ ఆపద సమయంలో వేగంతో వెళ్తున్నపు డు అంబులెన్స్‌లో ఉన్నవారితో పాటు రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఆపద కలగకుండా వ్యవహరిం చాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం ని ర్లక్ష్యం ప్రదర్శించినా ఇద్దరి ప్రాణాలకు అపాయ మే. అంతేకాకుండా అత్యవసర సమయంలో ఈఎంటీలకు సహాయం చేసేందుకు పెలైట్లకు ప్రథమ చికిత్స నిర్వహించే విధానంపై కూడా శి క్షణ ఇస్తారు. దీంతో ఈఎంటీలకు ప్రథమ చికి త్స సమయంలో పెలైట్లు చేదోడువాదోడుగా ఉంటారు. పెలైట్ల సేవల గుర్తింపు కోసం వారికి ఒక రోజును కేటాయించి ప్రతిభ కనబరిచిన పెలైట్లను 108 అధికారులు సత్కరిస్తుంటారు.