హైదరాబాద్: గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాధపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గన్నమని దొరబాబు(46) కూకట్‌పల్లిలోని ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సెంటర్‌లో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో ఆయన గాయపడ్డారు.
ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం దొరబాబును గురువారం తెల్లవారు జామున కూకట్‌పల్లి ఐకాన్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన చేతిలో దిగబడిన బుల్లెట్‌ను వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికి తీశారు. ప్రస్తుతం దొరబాబుకు ఎటువంటి అపాయం లేదని డాక్టర్లు తెలిపారు.