
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. వరదలతో అతలాకుతల మవుతున్న పలు గ్రామాలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. వల్సాద్ ప్రాంతలోని దర్మపూర్‌లో గత 24 గంటల్లో ఏకంగా 23.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో జామ్‌నగర్‌లో వరద పరిస్థితి భయంకరంగా ఉంది.
ఈ ఒక్క జిల్లాలోనే గత రెండు రోజుల్లో 11 మంది మరణించారు. సురేంద్ర నగర్ జిల్లాలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ధ్వంసం కావడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. తాజా వరద పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట ముఖ్యమంత్రి భూపేంద్రతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రజలకి సాధ్యమైనంతవరకు సాయం అందిస్తోందని షా ట్వీట్‌చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు స్థానియ యంత్రాంగం కూడా వరద ప్రాంతాల్లో సహాయ చర్యల్లో ముగినిపోయిందని అమిత్ తెలిపారు.