
సాక్షి, గుంటూరు: గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ నగర్‌లో శిలాఫలకాలను పగలగొట్టారు. గత ప్రభుత్వంలో రోడ్ల కోసం వేసిన శిలాఫలకాలను తానే స్వయంగా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇదేం పని అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పచ్చ మూకల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటింది. ఇంకా ప్రతిచోటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలు తగులబెట్టడం, కొట్టడం, ఊరిలో ఉండవద్దంటూ బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా వట్టిచెరుకూరు మండలం గారపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామంలో ఉండటానికి వీలులేదంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment