peddireddy ram chandra reddy
-
చంద్రబాబు, పవన్ సమాజానికి హానికరం...
-
చంద్రబాబు నీచ రాజకీయం..పెద్దిరెడ్డి ఫైర్..
-
ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ కుట్రలు చేస్తోంది: పెద్దిరెడ్డి
-
అభ్యర్థులు దొరకక అయోమయంలో చంద్రబాబు పెద్దిరెడ్డి సెటైర్లు
-
వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డిని అనంతపురం, హిందూపురం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అదనంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ డిప్యూటీ రీజినల్ కో–ఆర్డినేటర్‌గా టీజేఆర్ సుధాకర్ బాబును నియమించినట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
పురందేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: పురంధేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తరపున ఆమె మాట్లాడితే ఇబ్బంది లేదని, అయితే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనన్నారు. మద్యంపై చంద్రబాబుతో పురంధేశ్వరి మాట్లాడితేనే మంచిదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గక ఇంఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ రౌడీల దాడి: పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: టీడీపీ రౌడీల దాడిలో గాయపడిన పోలీసులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయంగా దివాళా తీశారని.. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘పుంగనూరు బైపాస్ నుంచి వెళ్తామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత కావాలనే పుంగనూరులోకి వెళ్లాలని ప్రయత్నించారు. అనంతరం పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడి పాల్పడేలా చేశారు. అనరాని మాటలు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టారు. పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవల కాలంలో లేవు. కుప్పంలో ఓడిపోతానన్న భయంతో చంద్రబాబు నీచానికి దిగారు’’ అని మంత్రి మండిపడ్డారు. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ ‘‘కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీసులకు, ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకం. షార్ట్ గన్స్కు లైసెన్స్ ఉండదు.. కానీ వారు ఆయుధాలు తెచ్చుకున్నారు. 200 వాహనాల్లో రౌడీలను తెచ్చుకున్నారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. -
వికేంద్రీకరణ జరగకపోతే భావితరాలు క్షమించవు : మంత్రి పెద్దిరెడ్డి
-
'ఎమ్మెల్యేలను కొంటూ, భూములు సంపాదించుకుంటూ..'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వదని తెలిసినా సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొంటూ, రాజధానిలో భూములు సంపాదించుకుంటూ ఏపీ ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు భయంతోనే చంద్రబాబు రాత్రికి రాత్రే విజయవాడ వచ్చేశారని తెలిపారు. అందుకే పాలమూరు ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచినా చంద్రబాబు స్పందించటం లేదని ధ్వజమెత్తారు. కర్నూలులో దీక్ష చేస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగానే చంద్రబాబుకు తెలంగాణ ప్రాజెక్టులు గుర్తుకొచ్చాయని తెలిపారు.