Chennai-Bengaluru AC Double Decker Train Derails Near Bangarapet - Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

May 16 2023 8:22 AM | Updated on May 16 2023 10:28 AM

Bengaluru Chennai AC Double Decker Train Derails - Sakshi

సాక్షి, గుడుపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే డబుల్‌ డెక్కర్‌ రైలు గుడుపల్లె మండలం బిసానత్తం రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం పట్టాలు తప్పింది. ఉదయం 11 గంటల సమయంలో చెన్నై నుంచి బెంగళూరుకు బయలు దేరిన ఈ రైలు రెండో కోచ్‌ చక్రాలు కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం వద్ద కిందకు దిగిపోయాయి. దీంతో పైలెట్‌ గమనించి రైలును ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పట్టాలు తప్పిన కోచ్‌లో 130 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ రైలును క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. డబుల్‌ డెక్కర్‌ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై-బెంగళూరు మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడిచాయి.  రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement