train derail
-
పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
సాక్షి, గుడుపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు గుడుపల్లె మండలం బిసానత్తం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం పట్టాలు తప్పింది. ఉదయం 11 గంటల సమయంలో చెన్నై నుంచి బెంగళూరుకు బయలు దేరిన ఈ రైలు రెండో కోచ్ చక్రాలు కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం వద్ద కిందకు దిగిపోయాయి. దీంతో పైలెట్ గమనించి రైలును ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పట్టాలు తప్పిన కోచ్‌లో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలును క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై-బెంగళూరు మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడిచాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
పట్టాలు తప్పినా వేగంగా దూసుకొచ్చిన రైలు.. జనం పరుగులు!
పాట్నా: బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ రైలు బిహార్‌లో పట్టాలు తప్పింది. గుర్పా రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు 53 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ధన్‌బాద్ డివిజన్ పరిధిలోని కొడెర్మా-మన్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున 6.24 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ‘బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు బోగీలు పట్టాలు తప్పేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే బృందాలు కృషి చేస్తున్నాయి.’ అని ఈసీఆర్ జోన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో అధికారులు అప్రమత్తమవటంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్నారు. 10 రైళ్లను దారి మళ్లించామని, నాలుగు రైళ్లు రద్దు చేశామని చెప్పారు. A goods train derails between Koderma and Manpur railway stations under #Dhanbad railway division. pic.twitter.com/Age2J3wcRa — TOI Patna (@TOIPatna) October 26, 2022 ఇదీ చదవండి: హనీట్రాప్: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది! -
దిఘా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : దిఘా నుంచి విశాఖపట్టణం వెళుతున్న దిఘా ఎక్స్‌ప్రెస్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగిపోయాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును ఆపివేశాడు. అయితే అప్పటికే ఇంజిన్ సహా మూడు బోగీలు విరిగిన పట్టాల పైనుంచి వెళ్లాయి. ఎట్టకేలకు రైలు ఆగటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గంటపాటు రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. అనంతరం రైలు కదిలింది. -
పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్/ ఇందల్వాయి: నిజామా బాద్– తిరుపతిల మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ ప్రెస్ (12793) రైలు పట్టాలు తప్పింది. తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తుం డగా నిజామాబాద్ జిల్లా ఇంద ల్వాయి మండలం సిర్నాపల్లి స్టేషన్‌కు సమీపంలో శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 16 బోగీలున్న ఈ రైలులో ఏసీ త్రీటైర్ (బీ1) బోగి వీల్‌త్రెడ్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బోగీకి చెందిన ముందు చక్రాలు పట్టాలు తప్పి ఒక టిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఒక్కసారిగా దుమ్ము రేగడంతో ప్రమా దాన్ని పసిగట్టిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు మరో కిలో మీటరు దూరంలో వాగుపై వంతెన ఉంది. ఇలాగే ముందుకు వెళ్లి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని భావిస్తున్నారు ప్రమా దానికి గల కారణాలపై ఇంజనీరింగ్ నిపుణుల బృందంతో విచారణ చేపట్టామని ఎస్సీఆర్ డీఆర్ఎం ఆరుణ్ కుమార్ జైన్, ఏజీఎం థామస్ జార్జ్ తెలిపారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన బోగీలు కావడంతో బోగి బోల్తాపడ లేదన్నారు. ప్రమాద సమయంలో ట్రైన్ వేగం 110 కి.మీ.లు ఉండవచ్చన్నారు. పలు రైళ్లు రద్దు.. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో సికింద్రాబాద్– నిజామా బాద్–ముంబయి రూట్లలో నాలుగు రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. సబల్‌పూర్–నాందేడ్ రైలు, ముంబయి, సికింద్రాబాద్ రైళ్లను వికారా బాద్ జిల్లా మీదుగా దారి మళ్లించారు. మేడ్చల్–నాందేడ్ రైలు, బోధన్– మిర్జాపల్లి, కాచిగూడ–మన్మాడ్, కాచిగూడ–నిజామాబాద్, మిర్జాపల్లి–బోధన్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. మరమ్మతులు చేసి, సాయంత్రం నుంచి రాకపోకలు కొనసాగించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఇబ్బందులు పడ్డారు. స్థానికులు ప్రయాణికులను ఆటోల్లో, స్కూల్ బస్సుల్లో జాతీయ రహదారిపై ఉన్న ఇందల్వాయి మండల కేంద్రానికి తరలించారు. బీ1 బోగిని తొలగించి మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణికులను ఎక్కించి ట్రైన్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రానికి పంపించారు. కొందరిని కామారెడ్డి స్టేషన్‌కు తరలించారు. -
పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్
-
యూపీలో మరో రైలు ప్రమాదం
సాక్షి, యూపీ: వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన ఉత్తర ప్రదేశ్ లో మరో రైలు పట్టాలు తప్పింది. హౌరా-జబల్ పూర్ మధ్య నడిచే శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. గురువారం వేకువ ఝామున ఒబ్రా రైల్వే స్టేషన్ వద్ద రైలుకు సంబంధించి ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. పట్టా విరిగిపోయి ఉండటంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. కాగా, సురేష్ ప్రభు నుంచి పీయూష్ గోయల్ పదవీ బాధ్యతలు చేపట్టాక చోటు చేసుకున్న తొలి ప్రమాదం ఇదే. ఘటనపై మంత్రి గోయల్ కు పూర్త సమాచారం అందించామని రైల్వే పీఆర్వో తెలిపారు. ఉదయం 6.25 సమయంలో ఘటన చోటు చేసుకుందని, మిగతా బోగీల్లో ప్రయాణికులను తరలించినట్లు ఆయన వివరించారు. -
పట్టాలు తప్పిన రైలు.. ఇద్దరి మృతి
పట్నా నుంచి గువాహటి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు మరణించడగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని సముక్తల స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు. రెస్క్యూ బృందాలను హుటాహుటిన ఘటనా స్థలానికి తరలించారు. రైలు డ్రైవర్ సిగ్నల్‌ను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంజన్, మరో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో ఒకటి ఎస్ఎల్ఆర్ కాగా, మరొకటి జనరల్ సెకండ్ క్లాస్ బోగీ. బిహార్‌లోని దానాపూర్ నుంచి గువాహటికి ఈ రైలు వెళ్లాల్సి ఉంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలో ఉన్న అలీపుర్దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైలు ఆగిపోవడంతో ఇరుక్కుపోయిన దాదాపు 150 మంది ప్రయాణికులను కామాఖ్య-అలీపుర్దౌర్ జంక్షన్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అలీపుర్దౌర్ తీసుకెళ్లారు. అక్కడ పట్టాలను బాగుచేసిన తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఈ ప్రమాదం విషయంలో ఏమైనా తెలుసుకోవాలంటే రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. అవి.. 9002052957, 8585082833 మరియు 03564-259935. -
బిహార్‌లో పట్టాలు తప్పిన రైలు
-
బిహార్‌లో పట్టాలు తప్పిన రైలు
పట్నా: బిహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఖగారియాలోని పస్రాహ స్టేసన్ సమీపంలో కటిహార్-అమృత్సర్ అమ్రపాలి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఏడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. పట్టాలు తప్పిన వాటిలో ఐదు స్లీపర్, రెండు ఏసీ బోగీలున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. సహాయక బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
పట్టాలు తప్పిన రైలు: 12 మంది దుర్మరణం
కరాచీ: పాకిస్థాన్‌లో ఉగ్రవాద ప్రభావిత బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం ఘోర దుర్ఘటన జరిగింది. బెలూచిస్థాన్ రాజధాని క్వెట్టా నుంచి రావల్పిండికి ప్రాయాణిస్తున్న 'జాఫర్ ఎక్స్ ప్రెస్' అబీగుమ్ ప్రాంతంలో పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు చెల్లాచెదురు కావడంతో 12 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 100 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంలో రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్లు కూడా చనిపోయారని... సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నాయని పాకిస్థాన్ రైల్వే మంత్రి సయ్యద్ రఫీక్ చెప్పారు. సహాయ బృందాలకు తోడు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపుతున్నట్లు బెలూచిస్థాన్ ప్రావిన్స్ హోం మంత్రి సర్ఫరాజ్ తెలిపారు. కాగా, నవంబర్ 1న ఇదే రైలుపై ఉగ్రవాదులు దాడి జరిపారు. శక్తిమంతమైన బాంబులతో రైలును పేల్చేందుకు ప్రయత్నించారు. నాటి సంఘటనలో నలుగురు చనిపోగా, ఆరుగురికి గాయలయ్యాయి. ఆ తరువాత జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుకు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఈ సంఘటన వెనుక కూడా ఉగ్రవాదుల హస్తమేమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.