సాక్షిప్రతినిధి, నిజామాబాద్/ ఇందల్వాయి: నిజామా బాద్– తిరుపతిల మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ ప్రెస్ (12793) రైలు పట్టాలు తప్పింది. తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తుం డగా నిజామాబాద్ జిల్లా ఇంద ల్వాయి మండలం సిర్నాపల్లి స్టేషన్‌కు సమీపంలో శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 16 బోగీలున్న ఈ రైలులో ఏసీ త్రీటైర్ (బీ1) బోగి వీల్‌త్రెడ్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
బోగీకి చెందిన ముందు చక్రాలు పట్టాలు తప్పి ఒక టిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఒక్కసారిగా దుమ్ము రేగడంతో ప్రమా దాన్ని పసిగట్టిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు మరో కిలో మీటరు దూరంలో వాగుపై వంతెన ఉంది. ఇలాగే ముందుకు వెళ్లి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని భావిస్తున్నారు ప్రమా దానికి గల కారణాలపై ఇంజనీరింగ్ నిపుణుల బృందంతో విచారణ చేపట్టామని ఎస్సీఆర్ డీఆర్‌ఎం ఆరుణ్ కుమార్ జైన్, ఏజీఎం థామస్ జార్జ్ తెలిపారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన బోగీలు కావడంతో బోగి బోల్తాపడ లేదన్నారు. ప్రమాద సమయంలో ట్రైన్ వేగం 110 కి.మీ.లు ఉండవచ్చన్నారు.
పలు రైళ్లు రద్దు..
రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో సికింద్రాబాద్– నిజామా బాద్–ముంబయి రూట్లలో నాలుగు రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. సబల్‌పూర్–నాందేడ్ రైలు, ముంబయి, సికింద్రాబాద్ రైళ్లను వికారా బాద్ జిల్లా మీదుగా దారి మళ్లించారు. మేడ్చల్–నాందేడ్ రైలు, బోధన్– మిర్జాపల్లి, కాచిగూడ–మన్మాడ్, కాచిగూడ–నిజామాబాద్, మిర్జాపల్లి–బోధన్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. మరమ్మతులు చేసి, సాయంత్రం నుంచి రాకపోకలు కొనసాగించారు.
ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఇబ్బందులు పడ్డారు. స్థానికులు ప్రయాణికులను ఆటోల్లో, స్కూల్ బస్సుల్లో జాతీయ రహదారిపై ఉన్న ఇందల్వాయి మండల కేంద్రానికి తరలించారు. బీ1 బోగిని తొలగించి మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణికులను ఎక్కించి ట్రైన్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రానికి పంపించారు. కొందరిని కామారెడ్డి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment