‘హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. వేధింపులా?’ | YSRCP MP Mithun Reddy flays AP Government Over Illegal Police Cases | Sakshi
Sakshi News home page

‘హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. వేధింపులా?’

Published Fri, Nov 15 2024 6:30 PM | Last Updated on Fri, Nov 15 2024 7:05 PM

YSRCP MP Mithun Reddy flays AP Government Over Illegal Police Cases

చిత్తూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం అత్యంత దారుణమమన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిని పూతలపట్టు వైఎస్సార్‌సీపీ మండల పార్టీ కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డిని మిథున్‌రెడ్డి పరామర్శించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కక్ష్య పూరిత రాజకీయాలకు టీడీపీ నాయకులు  స్వస్తి పలకాలి. సొంత ఊర్లో  తిరగలేని పరిస్థితి ఈరోజు పూతలపట్టు మండల పార్టీ కన్వీనర్ విషయంలో మీరు తీసుకు వచ్చారు. పోలీసులు చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పై దృష్టి పెట్టండి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. 

సోషల్ మీడియా కార్యకర్తలు పై కేసులు పేరుతో వేధింపులు మానుకోవాలి.గతంలో టీడీపీ ప్రోద్బలంతో  వైఎస్‌ జగన్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు పై వేధింపులు మానుకోవాలి.ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.. ఇలానే చేస్తే ముగింపు అనేది ఉండదు’ అని మండిపడ్డారు మిథున్‌రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement