![Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/26/Peddireddy.jpg.webp?itok=Xt_w6T_D)
సాక్షి, చిత్తూరు: దొంగ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబు గెలుస్తూ వస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో ఇప్పటికీ దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లను తొలగించి ఎన్నికల కమిషన్ ప్రక్షాళన చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుదని.. 2019కి ముందు రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారు.. ఇప్పుడు చంద్రబాబు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి దుయ్యబట్టారు.
ద్వేషంతో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం: శ్రీకాంత్‌రెడ్డి
వైఎస్సార్ జిల్లా: వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని, ఆయన పాలనలో ఒక్క ప్రాజెక్టయినా రూపకల్పన చేశారా? అంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు నీళ్లు అందించిన గొప్ప నేత వైఎస్సార్. ద్వేషంతో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ ధర్నా చేయించిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమకు అభివృద్ధి చూపిన నాయకులు వైఎస్సార్, జగన్’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
చదవండి: విజయవాడలో టీడీపీ నేత ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరార్!
Comments
Please login to add a commentAdd a comment