సాక్షి, కుప్పం/శాంతిపురం: కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ బిడ్డ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కుప్పానికి 35ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేక మోసం చేసే చంద్రబాబు కావాలా? అని ముఖ్యమంత్రి జగన్ కుప్పం ప్రజలను అడిగారు.
సీఎం జగన్ పంచ్ కామెంట్స్..
- కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్
- కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్
- కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్
- కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్
- చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు.
- చిత్తూరు పాల డెయిరీని పున:ప్రారంభించింది మీ జగన్.
- కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం.
►చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ, అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ.
►చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు.
►కనీసం ఇక్కడ సొంత ఇళ్లు అయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి.
►సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచి పని అయినా ఉందా? ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు.
►ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా?
►14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకు?’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment