టీచర్ల లెక్క తేల్చండి | Andhra Pradesh govt initiates steps to revoke GO 117 | Sakshi
Sakshi News home page

టీచర్ల లెక్క తేల్చండి

Published Sun, Jan 19 2025 3:32 AM | Last Updated on Sun, Jan 19 2025 3:32 AM

Andhra Pradesh govt initiates steps to revoke GO 117

జీవో నంబర్‌ 117 ఉపసంహరణ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు

సాక్షి, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్లో 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల బోధనతోపాటు మెరుగైన బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 117ను రద్దు చేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ జీవో ఉపసంహరణ వల్ల కలిగే మార్పులను గుర్తించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ప్రతి పంచాయతీలోను మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ ఏర్పాటు, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పునర్విభజన (మిగు­లు/­అవసరం)పై లెక్కలు తేల్చాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది.

మోడల్, బేసిక్, ఫౌండేషనల్‌ ప్రాథ­మిక పాఠశాలలు, యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలుగా పునర్‌ నిర్మాణం చేసేందుకు అవసరమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు వర్క్‌షీట్లు నింపి పూర్తి వివరాలతో ఈ నెల 20–25 వరకు జరిగే జోనల్‌ సమావేశాల్లో అందించాలని క్షేత్ర స్థాయి అధికారులకు విద్యాశాఖ అధికారులు సూచించారు. దీంతో ఆయా పాఠశాలల వారీగా మ్యాపింగ్‌కు ముందు, తర్వాత వి­ద్యా­ర్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్యను వర్క్‌షీట్లలో నమో­దు చేయాల్సి ఉంటుంది. పాఠశాలల మ్యాపింగ్‌ తర్వాత ఏర్పడే ఫండమెంటల్, బేసిక్, మోడల్‌ ప్రైమరీ, యూపీ, హైస్కూ­ళ్ల వివరాలను కూడా నివేదించాల్సి ఉంది. 

దీంతోపాటు 47 కేటగిరీలకు సంబంధించిన టీచింగ్‌ పోస్టుల ు... మంజూరైనవి, పనిచేస్తు­న్నవి, మిగులు, అవసరం, డీఎస్సీ కో­టా.. పాఠశాల యాజమా­న్యాల వారీగా వివరాలు సేకరించి పా­త, కొత్త జిల్లాల వారీగా తయారు చేయాలని ఆదేశించారు. ఉన్నత పాఠశాలల్లో 6–10 తరగతుల విద్యార్థుల సంఖ్యను బట్టి స్టాఫ్‌ ప్యాట్రన్‌ను తాజా నిబంధనల ప్రకారం తయారు చేస్తారు. ఈ ప్రకారం పాఠశాలల పునర్విభజన చేస్తే హైస్కూళ్ల­లో 10వేల స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) పోస్టులు మిగులు ఏర్పడే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

సరైన ప్రత్యామ్నాయం లేకుండానే మార్పులు 
ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 3–5 తరగతుల విద్యా­ర్థులకు సబ్జెక్టు టీచర్ల బోధన అందించడంతోపాటు మెరుగైన బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకొస్తూ గత ప్రభు­త్వం జీవో నంబర్‌ 117 జారీ చేసింది. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలని కంకణం కట్టు­కుంది. దానిలో భాగంగా ఇటీవల ప్రత్యామ్నాయ మార్గద­ర్శకాలను విడుదల చేసింది. అయితే, ఈ మార్గదర్శకా­ల్లో అనేక ఇబ్బందులు ఉండడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరే­కిస్తు­న్నా ప్రభుత్వం ఆ మార్గదర్శకా­లనే అమలు చేసేందుకు సిద్ధమైంది. కొత్త విధానం ప్రకారం స్టాఫ్‌ ప్యాట్రన్‌ లెక్కించలేదు. ఉన్నత పాఠశాలల్లో 75 మందికంటే తక్కువ విద్యా­ర్థులు ఉంటే అక్కడ స్కూల్‌ అసిస్టెంట్లతో కాకుండా ఎస్‌జీ­టీలతో బోధన అందించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement