సొసైటీ కార్యాలయంలో చేపట్టిన ఆందోళనపై ఎస్సీ గురుకుల సొసైటీ ఆగ్రహం
142 మంది ఉద్యోగులకు లిఖితపూర్వక హెచ్చరికలు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో డిస్‌లొకేట్ అయిన టీచర్ల వైఖరిపై సొసైటీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. జోనల్ కేటాయింపుల్లో భాగంగా డిస్‌లొకేట్ చేసిన నేపథ్యంలో ఆయా ఉద్యో గులంతా ఈనెల 21న సొసైటీ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. సొసైటీ కార్యాలయ పరిధిలో గుంపుగా అల్లరి చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ధర్నా చేపట్టడం, కార్యా లయంలోకి బలవంతంగా ప్రవేశించడం, దురుసు ప్రవర్తన ఘటనలపై సొసైటీ అధికారులు మండిపడుతున్నారు.
సమస్యలుంటే పలు వేదికల వద్ద నిబంధనలకు లోబడి విన్నవించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆందోళనపూరిత వాతావరణం సృష్టించడం నిబంధనలకు విరుద్ధమని టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి అలగు వర్షిణి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం వారంతా శిక్షార్హులని, అయినప్పటికీ చివరి అవకాశంగా భావిస్తూ వారికి లిఖితపూర్వక హెచ్చరికలు జారీ చేయాలని జోనల్ అధి కారులను ఆమె ఆదేశించారు. ఈమేరకు 142 మంది ఉద్యోగులతో కూడిన జాబితాను సంబంధిత జోనల్ అధికారులకు ఆమె పంపారు.
మరో వైపు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి గురు కుల పాఠశాలకు చెందిన టీజీటీ కె.విజయనిర్మలను సొసైటీ కార్యా లయానికి హాజరై వివరణ సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె శుక్రవారం ఉదయం 11గంటలకు కార్యదర్శి ఎదుట హాజరైనట్లు సమాచారం. మరోవైపు విజయనిర్మలను సస్పెండ్ చేస్తూ సొసైటీ కార్య దర్శి అలగు వర్షిణి 22వ తేదీనే ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
ప్రజాభవన్‌లో వినతులు: ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో డిస్‌లొకేట్ అయిన ఉద్యోగులు పలువురు శుక్రవారం ప్రజాభవన్‌కు చేరుకుని ప్రజావాణిలో ప్రత్యేకాధికారి దివ్యకు వినతులు సమర్పించారు. స్థానికతను పరిగణించకుండా ఉద్యోగ కేటాయింపులు జరపడాన్ని తప్పుబట్టిన ఉద్యోగులు... తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment