
నల్లగొండ : డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు పెట్టారు. వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు మంగళవారం జిల్లా విద్యాశాఖ నల్లగొండ డైట్‌లో మాన్యువల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.

ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులు అందుకున్న వారంతా నల్లగొండలోని డైట్‌కు చేరుకున్నారు

అయితే కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని ఉదయాన్నే విద్యాశాఖకు ఆదేశాలు రావడంతో వచ్చిన నూతన ఉపాధ్యాయులంతా వెనుదిరిగి పోయారు

తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో నూతన ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు ఫోన్లు చేసి పిలిచారు. అభ్యర్థులు డైట్ వద్దకు పరుగులు పెట్టారు

మధ్యాహ్నం 2 గంటలకు ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రారంభమైంది

మొదట స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, పండిట్లకు సంబంధించిన పోస్టింగ్‌లు జారీ చేశారు

ఈ ప్రక్రియ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత ఎస్‌జీటీలు, ప్రభుత్వ, లోకల్‌బాడిలకు సంబంధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ప్రారంబించారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు























