
ఆన్‌లైన్‌లో ఆరా
* పాఠశాలల పనితీరు పరిశీలనకు కొత్త పద్ధతి
* ప్రత్యేక ఫార్మాట్ రూపొందించిన విద్యా శాఖ
* డీఈఓ కార్యాలయం నుంచే పర్యవేక్షణ
ఖమ్మం : సర్కారు పాఠశాలల పనితీరును ఇక ఇట్టే పసిగట్టొచ్చు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విధులు, పాఠశాల ప్రగతి, సౌకర్యాలు, అవసరాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు కొత్త విధానాన్ని అవలంబించనున్నారు. విద్యా శాఖ కార్యాలయం నుంచే అన్ని పాఠశాలల పరిస్థితులు ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోనున్నారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారు.
నమోదు చేసే అంశాలు ఇవే...
ప్రతి పాఠశాల రిపోర్టును ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. ఇందుకు ఖమ్మం : సర్కారు పాఠశాలల పనితీరును ఇక ఇట్టే పసిగట్టొచ్చు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విధులు, పాఠశాల ప్రగతి, సౌకర్యాలు, అవసరాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు కొత్త విధానాన్ని అవలంబించనున్నారు. విద్యా శాఖ కార్యాలయం నుంచే అన్ని పాఠశాలల పరిస్థితులు ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోనున్నారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారు.
నమోదు చేసే అంశాలు ఇవే...
ప్రతి పాఠశాల రిపోర్టును ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. ఇందుకు ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు, బడిబయట ఉన్న పిల్లలు, ఈ ఏడాది బడిలో చేరిన విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలు, వారి అర్హత, వారు ఎంతకాలంగా పనిచేస్తున్నారు, పాఠశాల అభివృద్ధిలో యాజమాన్యం కమిటీ భాగస్వామ్యం ఎంత, పాఠశాలల్లో సమకూర్చాల్సిన సౌకర్యాలు, ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. అదేవిధంగా విద్యార్థుల ప్రగతి నివేదిక, యూనిట్, సమ్మెట్ పరీక్షల్లో సాధించిన గ్రేడ్లు కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
ప్రయోజనమిలా...
ప్రభుత్వ పాఠశాలల వివరాలు ఆన్‌లైన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఖ్య, వారి సర్వీస్ విషయంలో తలెత్తే పొరపాట్లు సవరించొచ్చని, పదోన్నతులు పాదర్శకంగా చేపట్టొచ్చని, ఉపాధాయులు పనితీరును కూడా పసిగట్టొచ్చని అంటున్నారు. విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తూ ప్రత్యేక కార్యాచరణతో బోధించొచ్చని పేర్కొంటున్నారు.
సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక విద్యామిషన్, పాఠశాల అభివృద్ధి నిధులు, ఇతర గ్రాంట్స్ వినియోగం విషయాలను వెనువెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. పాఠశాలల్లోని తాగునీరు, విద్యుత్, అదనపు తరగతి గదులు తదితర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతోపాటు మంజూరైన నిధులతో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టొచ్చని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా.. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సరిగా అందుతోందా..? అనే విషయాన్ని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. బడికి సక్రమంగా వెళ్లని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. అయితే.. కంప్యూటర్లు ఉన్న పాఠశాలల్లో ఈ విధానం సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కంప్యూటర్లు లేని పాఠశాలల వివరాలు ఎలా తెలుసుకోవాలన్నదే విద్యా శాఖ అధికారులకు అంతుపట్టడం లేదని తెలుస్తోంది.
పర్యవేక్షణ ఇక సులభం: రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచబోతున్నాం. దీంతో పర్యవేక్షణ సులభతరం కానుంది. సమాచార హక్కు వివరాలు అడిగిన వారికి ఇచ్చేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది. ఆన్‌లైన్ ప్రక్రియ కోసం అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే ప్రత్యేక ఫార్మట్ తయారు చేసి పంపించాం.