అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాశాఖలో పని చేస్తున్న ముగ్గురు సూపరింటెండెంట్లు బదిలీ అయ్యారు. డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న ప్రసాద్‌బాబును కడప మోడల్ స్కూళ్ల విభాగానికి, సురేష్‌బాబును కడప ఆర్‌ఎంఎస్‌ఏ విభాగానికి బదిలీ చేశారు. పాఠ్యపుస్తకాల మేనేజర్‌గా పని చేస్తున్న సుకుమార్‌ను కడప జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్‌గా బదిలీ చేశారు. వీరి స్థానాల్లో కడప మోడల్ స్కూళ్ల విభాగంలో పని చేస్తున్న రంగస్వామిని, అనంతపురం ఆర్‌ఎంఎస్‌ఏ విభాగంలో పని చేస్తున్న సయ్యద్ హుసేన్‌ను నియమిస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా బదిలీ అయిన ముగ్గురు సూపరింటెండెంట్లను సాయంత్రం డీఈఓ లక్ష్మీనారాయణ, ఇతర సిబ్బంది సన్మానించారు.