సాక్షి, విజయవాడ: ఏపీలో ఈనెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే, జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యాకానుక పంపిణీ చేయనున్నట్టు బొత్స స్పష్టం చేశారు.
కాగా, మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జగనన్న విద్యాకానుక ఒక్కొక్క కిట్‌కు రూ.2500లకు పైగా ఖర్చు అవుతుంది. పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 40లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందనుంది. టెన్త్, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రోత్సహకాలు ఉంటాయి.
అలాగే, జూన్ 28వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా అమ్మఒడి కార్యక్రమం జరుగనుంది. నాడు-నేడు మొదటి ఫేజ్‌లో పూర్తి అయిన పాఠశాలలకి డిజిటల్ విద్య అందనుంది. ఈనెల 12 నుంచి పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ప్రారంభిస్తాం. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు. ప్రతీ మండలానికి రెండు జూనియర్ కళాశాలులు. ఇందులో ఒక జూనియర్ కాలేజీ కేవలం విద్యార్థునులకి మాత్రమే. జగనన్న గోరుముద్దలో రాగిజావ కూడా అందిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాయుడు
Comments
Please login to add a commentAdd a comment