సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం చేసిన ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకువేళ్లాలని అన్నట్లు తెలిపారు.
పవన్ కల్యాణ్ ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని మండిపడ్డారు. వ్యకిగత విమర్శలు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దయ్యబట్టారు. పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్సార్‌సీపీని విమర్శించడమే పవన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ ప్రజా సమస్యలపై మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment