
సాక్షి, హైదరాబాద్: మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా ఘనంగా జరిగింది. కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితను సందీప్ వివాహమాడారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు సుచరిత, పేర్ని నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, రోజా, కేంద్ర మాజీ మంత్రి సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు, నాగబాబు, బండ్ల గణేశ్, బెల్లంకొండ శ్రీనివాస్–గణేశ్ కూడా హాజరయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఎంపీలు కె.కేశవరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ మధుయాష్కీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.
చదవండి: Under 19 Vice Captain Shaik Rasheed: సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా
Comments
Please login to add a commentAdd a comment