
సాక్షి, విజయనగరం: కొన ఊపిరితో ఉన్న పార్టీని బతికించడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఆరాటపడుతున్నారు. విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
కాగా, మంత్రి బొత్స శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి నిజాం వాళ్లకి అమ్మేసింది చంద్రబాబే. బాబు హయాంలో బీసీలను ఎందుకు కేంద్రమంత్రిని చేయలేదు. తోటపల్లి ప్రాజెక్ట్ చంద్రబాబు పూర్తి చేశారంటే నవ్విపోతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే నమ్ముతారు అనుకుంటే ఎలా?. మేము గడప గడపకు వెళ్లి చేసింది చెప్తున్నాము. గతంలో ఏ ప్రభుత్వం అయినా చెప్పిందా?.
చంద్రబాబు.. వ్యక్తి గత అంశాలు, అసత్యాలు మాట్లాడుతున్నాడు. ఆర్బీకేలను ప్రపంచ దేశాలను ఆకర్షించాయి. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అనలేదా?. ప్రజా కార్యాక్రమాలు ఎంత బాధ్యతగా చేయాలో మాకు తెలుసు. రాజకీయ పార్టీ నిర్వహించేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. చంద్రబాబుకి విజయనగరం జిల్లా గురించి, రైతులు, ఆస్పత్రులు, విద్య గురుంచి మాట్లాడే హక్కు లేదు’ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment