సాక్షి, అమరావతి : పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, గ్రామాల్లో కక్షలు,కార్పణ్యాలు లేకుండా ఎన్నికలు జరుపుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వాక్సినేషన్‌పై సమావేశం జరిగింది. కేంద్రానికి వాక్సినేషన్‌పై లేఖ పంపుతున్నాం. వాక్సినేషన్ చేసుకున్న వాళ్లే ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది. ఒకరు చనిపోయారు కూడా. అందుకే ఏ విధంగా వాక్సినేషన్ కొనసాగించాలనే దానిపై కేంద్రం సలహా కోరనున్నాం. పార్టీ రహిత ఎన్నికలు కాబట్టి లక్షలు లేకుండా ఏకగ్రీవాలు చేసుకోండి. ( సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: సజ్జల )
కేంద్రం ఇచ్చే ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తాం. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎదో చేస్తాడని కాదు.. మేము 100 శాతం విజయం సాధిస్తాం. కాకపోతే ఉద్యోగుల, ప్రజల ఆరోగ్యం గురించి మేము భయపడ్డాం. వారి భద్రత మాకు ముఖ్యం అని పోరాడాం. ఇప్పుడు మన ముందు ఉన్నది సుప్రీంకోర్టు ఆదేశాలు. వాటిని శిరసావహిస్తాం. ఎన్నికలు చూసి భయపడి కాదు.. రేపు ప్రజా క్షేత్రంలో ఎవరు కరెక్టో తెలిసిపోతుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment