సాక్షి, విశాఖపట్నం: నేడు(సెప్టెంబర్ 5న) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో ప్రైవేటు స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయన్నారు.
కాగా, నేడు విశాఖలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. విద్య కోసం రూ.12వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు. 60వేల క్లాస్ రూమ్స్‌లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు మా కుటంబ సభ్యులే అని కీలక వ్యాఖ్యలు చేశారు.
అలాగే, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కొన్ని పత్రికలు చూస్తున్నాయి. జీతాలు ఇవ్వలేదని అవాస్తవాలు రాస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. అన్ని యూనివర్సిటీల్లో పోస్టులన్నింటినీ డిసెంబర్‌కల్లా భర్తీ చేస్తాం’ అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment