Teachers day celebrations
-
జపాన్‌లో టీచర్స్ డే ఎలా జరుపుకుంటారో తెలుసా!
జపాన్‌లో అసలు ఉపాధ్యాయుల దినోత్సవమే ఉండదట. ఔను! మీరు వింటుంది నిజమే. అక్కడ అసలు ఆ దినోత్సవమే చేసుకోరట. ఇదేంటి సైన్సు అండ్ టెక్నాలజీ పరంగా ఎంతో ఎదిగిన దేశంలో ఇలాంటి "డే" ఉండకపోవటం ఏమిటి అనిపిస్తుంది గదా! జపాన్ వాళ్లు ప్రత్యేకించి ఉపాధ్యాయ దినోత్సవం అని ఏమి జరుపుకోరు. అక్కడ ఉపాధ్యాయుల పట్ల వారు కనబర్చే తీరుని చూస్తే కచ్చితంగా అవాక్కవుతారు. ఓ టీచర్ గనుక మెట్రో రైలు లేదా బస్సు మరేదైనా ప్రజా రవాణాలో వెళ్లితే ప్రజలు తక్షణమే లేచి నిలబడి కూర్చొమని సీటు ఇస్తారట. అంతలా ప్రజలు టీచర్ల పట్ల గౌరవ ఆదరాభిమానాన్ని చూపిస్తారట వాళ్లు. జపాన్‌లో ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకంగా ఒక దుకాణం కూడా ఉంటుందట. అక్కడ వారు తక్కువ ధరకే కావల్సిన వస్తువులను కొనుగోలు చేసి తీసుకువెళ్లొచ్చట. అంతేగాదు జపాన్ వాసులు ఉపాధ్యాయ వృత్తిని అత్యంత గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తారు. మెట్రోలో వారికి ప్రత్యే సీట్లు కేటాయిస్తారు. వారి కోసం ప్రత్యేక దుకాణాలే గాక ఎక్కడికైనా వెళ్లేందుకు టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదట. ఆఖరికి జపాన్ పారిశ్రామిక వేత్తలు సైతం ఉపాధ్యాయులు దుకాణాలకు వస్తే సంతోషిస్తారట వారికి తగిన గౌరవం ఇస్తారట. వారు కొనగలిగిన ధరకే వస్తువులను ఇచ్చి పంపిస్తారట కూడా. అందువల్ల జపనీస్ ఉపాధ్యాయులుకు ప్రత్యేకంగా గౌరవించి సెలబ్రేషన్ చేసేలా ఓ రోజు అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ ఉపాధ్యాయుల జీవితం వేడుకగా, గౌరవప్రదంగా ఉంటుంది. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
డిసెంబర్ కల్లా వర్సిటీల్లో పోస్టుల భర్తీ: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: నేడు(సెప్టెంబర్ 5న) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో ప్రైవేటు స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయన్నారు. కాగా, నేడు విశాఖలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. విద్య కోసం రూ.12వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు. 60వేల క్లాస్ రూమ్స్‌లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు మా కుటంబ సభ్యులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కొన్ని పత్రికలు చూస్తున్నాయి. జీతాలు ఇవ్వలేదని అవాస్తవాలు రాస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. అన్ని యూనివర్సిటీల్లో పోస్టులన్నింటినీ డిసెంబర్‌కల్లా భర్తీ చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్ -
SP సుమతి గురువు ఎవరో తెలుసా..?
-
Teachers Day 2022: మాతృభాషలో బోధనతో ప్రతిభకు పదును
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిలషించారు. మాతృభాషలో బోధిస్తే పిల్లల్లో సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలను వారు సులువుగా అర్థం చేసుకోగలుగుతారన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో పాఠశాల, ఉన్నత విద్యలో భారతీయ భాషలకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తమ గ్రామం నుంచి కాలేజీలో చదువుకునేందుకు వెళ్లిన మొదటి బాలికగా నిలవడం వెనుక ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. వారికి తానెంతో రుణపడి ఉంటానన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. -
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. డాక్టర్ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానన్నారు. ‘‘ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. సాన పట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంది. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులే వెలికితీస్తారు. నాకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటాను. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టాం. విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్ తరాలకు అవసరమైన అందిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. ఉపాధ్యాయులకు పురస్కారాలు రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం జగన్ ప్రదానం చేసి సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాలు
-
Teachers Day 2022: ఆచార్య దేవోభవ!
ఆయన ఓ తత్వవేత్త.. ఓ రాజనీతిజ్ఞుడు... అన్నింటికీ మించి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. విద్యార్థులంటే ఆయనకు అంతులేని ప్రేమ.. ఆయన అంటే విద్యార్థులకు ఎనలేని గౌరవం. విద్యార్థుల్ని ఉత్తమపౌరులుగా తీర్చినప్పుడే భవిష్యత్తు భారతం బాగుంటుందని భావించిన ఉత్తమ టీచర్ ఆయన.. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబరు 5 అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజును ఏటా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉన్నతమైన ఆదర్శాలు నెలకొల్పిన ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా సర్వేపల్లికి అందించే నిజమైన నివాళిగా దీనిని అభివర్ణిస్తారు. ఆయనకు 77 ఏళ్లు వచ్చినప్పటి నుంచి అంటే 1962 సెప్టెంబరు 5 నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. . ► సెప్టెంబరు 5న 1888లో జన్మించిన సర్వేపల్లి ... దేశం గర్వించదగ్గ మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లికి విద్యార్థులంటే పంచప్రాణాలు. విద్యార్థులకు కూడా ఆ మాస్టరుగారంటే చెప్పలేంత గౌరవం. అలా విద్యార్థుల ఆదరాభిమానాలు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి. ► విలువైన విద్యకు సర్వేపల్లి ప్రతిరూపం. విలువలున్న విద్యను ప్రోత్సహించాలన్నది ఆయన జీవితాశయం. అక్షరాశ్యతలో దేశం దూసుకుపోవాలన్నది ఆయన ఆకాంక్ష. యువతకు విద్యాబుద్ధులు నేర్పించడంలో... వారిని సరైన దిశలో పయనించేలా చేయడంలో పాటించిన నిబద్ధతకు గౌరవసూచికంగా ఆయనను గౌరవించుకుంటున్నాం. అందుకే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ► మైసూరు, కలకత్తా యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేసిన సర్వేపల్లి...ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోనూ తత్వశాస్త్రాన్ని బోధించారు. బెనారస్, ఆంధ్రా యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. తత్వశాస్త్రంపై ఎన్నో పుస్తకాలు రాశారు. సాహిత్యంలో 16 సార్లు, శాంతి కేటగిరీలో 11 సార్లు... ఇలా 27 సార్లు ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ కోసం సర్వేపల్లి పేరు నామినేట్ కావడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. ► సోవియట్ యూనియన్‌కు రాయబారిగా కూడా ఆయన పనిచేశారు. అన్నింటికన్నా మిన్నగా దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా ...రెండో రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టి ఆ పదవులకే వన్నెతెచ్చారు సర్వేపల్లి. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు అందుకున్న భారత రత్నం ఆయన. -బొబ్బిలి శ్రీధరరావు -
ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనున్న సీఎం వైఎస్ జగన్
-
Best Teacher Award: గురు దేవోభవ!
బడి... బిడ్డను విద్యార్థిగా మార్చే అక్షరాల ఒడి. ఆ ఒడిలో పిల్లలు హాయిగా అక్షరాలు దిద్దాలి. భవిష్యత్తును బంగారంగా దిద్దుకోవాలి. బిడ్డల భవిష్యత్తును దిద్దే చేతులకు వందనం. ఉపాధ్యాయ వృత్తికి వందనం. వృత్తికి వన్నె తెచ్చిన గురువులకు వందనం. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అంటే విద్యాబోధనలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ఓ గుర్తింపు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకుంటున్న వారిలో ఇద్దరు మహిళలున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని కానూరు ‘జిల్లా పరిషత్ హైస్కూల్’ ఫిజిక్స్ టీచర్ రావి అరుణ. మరొకరు హైదరాబాద్, నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు ఐదవ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగుతుంది. సునీతారావు, రావి అరుణ ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘మాది మైసూర్. బాల్యం హైదరాబాద్‌లోనే. ఐదవ తరగతి వరకు సెయింట్ ఆన్స్‌లో చదివాను. ఆరవ తరగతి నుంచి చెన్నై. నా బోధన ప్రస్థానం కర్నాటక రాష్ట్రం తుముకూరులోని టీవీఎస్ అకాడమీలో మూడవ తరగతి టీచర్‌గా మొదలైంది. ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమిటంటే నేను చదువు చెబుతూ చదువుకున్నాను. ఉద్యోగం చేస్తూ ఎంఏ ఎకనమిక్స్, ఎంఫిల్ పూర్తి చేశాను. ఆ తర్వాత కేంబ్రిడ్జిలో డిప్లమో, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాను... ఇలా ఏటా స్కూల్ వెకేషన్‌ని నేను ఏదో ఒక కోర్సుకోసం ప్లాన్ చేసుకునేదాన్ని. నాకిష్టమైన గణితం కోసం చెన్నైలోని రామానుజమ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాను. ముప్పై రెండేళ్ల సర్వీస్‌లో నేను పిల్లలకు ఎన్నో నేర్పించాను, అంతకంటే ఎక్కువగా నేను నేర్చుకున్నాను. టీచర్ ఎప్పుడూ ఒకచోట ఆగిపోకూడదు. నిత్య విద్యార్థిలా రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. పుస్తకాల్లో ఉన్న విషయాన్ని చెప్పి పాఠాలు ముగిస్తే సరిపోదు. కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటిని దైనందిన జీవితానికి అన్వయిస్తూ పాఠం చెప్పాలి. అలాగే ఏ తరగతికి అవసరమైతే ఆ తరగతికి పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నేను థర్డ్ క్లాస్ టీచర్‌గా చేరినా, అవసరమైనప్పుడు ఫస్ట్ స్టాండర్డ్‌కి కూడా పాఠాలు చెప్పాను. పన్నెండో తరగతి టీచర్ అయినా సరే ఒకటవ తరగతి టీచర్ లేనప్పుడు ఆ క్లాస్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే పాఠాన్ని సృజనాత్మకంగా చెప్పాలి. పిల్లలకు ఏ పదాలు అర్థం అవుతున్నాయో ఆ పదాల్లో వివరించాలి. వృత్తి పట్ల గౌరవం, విశ్వాసం ఉండాలి. రూల్స్‌కోసం పని చేసే వృత్తి కాదిది. అవసరమైన విధంగా ఒదిగిపోవాలి. కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం మొదలవుతుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రుల కంటే ముందు పసిగట్టగలిగింది టీచర్ మాత్రమే. పేరెంట్స్ వచ్చి చెప్పేవరకు టీచర్ గుర్తించని స్థితిలో ఉండకూడదు. అలాంటి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాను నేను. వాళ్లతో విడిగా మాట్లాడి, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి కోసం మెంటార్‌గా ఒక టీచర్‌కు బాధ్యత అప్పగించడం ద్వారా ఆ స్టూడెంట్ తిరిగి చదువుమీద మునుపటిలా ధ్యాస పెట్టేవరకు కనిపెట్టి ఉండాలి. అలాంటప్పుడు తల్లిదండ్రులు వచ్చి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తుంటారు. టీచర్‌గా అత్యంత సంతోష పడే క్షణాలవి. గురుశిష్యుల బంధం విద్యార్థులు అమ్మానాన్న తర్వాత ఆదర్శంగా తీసుకునేది టీచర్నే. అందుకే టీచర్ గౌరవప్రదంగా కనిపించాలి. ఆహార్యం, మాటతీరు, నడవడిక... ప్రతి విషయంలోనూ ఆదర్శనీయంగా ఉండాలి. గురుశిష్యుల బంధం ఉన్నతమైంది. స్టాఫ్‌రూమ్‌లో ఉపాధ్యాయుల మధ్య జరిగే సంభాషణ కూడా పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. విద్యాబోధనకు అవసరమైన చర్చలే ఉండాలి. అలాగే ప్రతి టీచరూ క్లాస్‌కి వెళ్లే ముందు ఏం చెప్పాలనే విషయం మీద తప్పనిసరిగా హోమ్‌వర్క్ చేయాలి, పాఠం చెప్పిన తర్వాత సరిగ్గా చెప్పానా లేదా అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఇదే ఒక టీచర్‌గా నా తోటి ఉపాధ్యాయులకు నేను చెప్పగలిగిన మంచిమాట’’ అన్నారు సునీతారావు. పాఠం చెప్పి ఊరుకుంటే చాలదు! ప్రిన్సిపల్‌గా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కరికులమ్ రూపొందిస్తుంటాను. గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండాల్సిన తరం ఇది. ఒకప్పటిలా సిలబస్‌కే పరిమితమైతే సరిపోదు. క్యారెక్టర్ బిల్డింగ్ చాలా ముఖ్యం. విలువలు, క్రమశిక్షణ, ధైర్యం, అంకితభావం, నిజాయితీ వంటివన్నీ వ్యక్తిత్వానికి ఒక రూపునిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన నైపుణ్యం ఏదో ఒకటి ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలకు పరిపూర్ణమైన విద్య అందుతుంది. మా దగ్గర స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసే విద్యార్థులకు అవసరమైన సెలవులు ఇవ్వడం, వారి కోసం సాయంత్రం ప్రత్యేక తరగతులు చెప్పించి పరీక్షలు పెట్టడం వంటి మార్పులు చేశాను. టీచర్ అంటే విద్యార్థులకు పాఠం చెప్పడమే కాదు, వారి భవిష్యత్తు కలలకు ఒక రూపం ఇవ్వాలి, ఆ కలల సాకారానికి అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి. – సునీతారావు, ప్రిన్సిపల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం, సికింద్రాబాద్ సైన్స్ ఎక్కడో లేదు... ‘‘నేను పుట్టింది గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో. పెరిగింది మాత్రం మచిలీపట్నంలో. మా నాన్న రావిరంగారావు బీఎస్సీ కాలేజ్ ప్రిన్సిపల్, అమ్మ ప్రభావతి. అమ్మ కూడా టీచరే. ఆ నేపథ్యమే నన్ను బోధనరంగం వైపు మళ్లించి ఉంటుంది. నిజానికి చిన్నప్పుడు నా మదిలో ‘భూమి ఎలా పుట్టింది, గ్రహాలు వలయాకారంలో ఎందుకుంటాయి’ వంటి అనేక ప్రశ్నలు మెదిలేవి. అలాగే సైంటిస్ట్ కావాలనే ఆలోచన కూడా. కానీ ఎందుకో తెలియదు బీఈడీలో చేరిపోయాను. బీఈడీ పూర్తయిన వెంటనే 1996లో ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ విజయవాడలోని ఎనికేపాడులో. అక్కడి తోటి ఉపాధ్యాయుల ప్రభావంతో బోధనను బాగా ఎంజాయ్ చేశాను. చదువు చెబుతూనే చదువుకుంటున్నాను. ఎమ్మెస్సీ, ఎమ్ఈడీ, విద్యాబోధనలో ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నాలజీస్ మీద íపీహెచ్డీ పూర్తయింది. ఇప్పుడు ఫిజిక్స్ లో మరో పీహెచ్డీ చేస్తున్నాను. ప్రత్యామ్నాయం వెతకాలి! సైన్స్ అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, మన చుట్టూ ఉంటుందని చెప్పడంలో విజయవంతమయ్యాను. పరిశోధన ల్యాబ్‌లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా చేయవచ్చని నేర్పించాను. పరిశోధనకు ఒక వస్తువు లేకపోతే ప్రత్యామ్నాయంగా అదే లక్షణాలున్న మరో వస్తువును ఎంచుకోవడం గురించి ఆలోచింపచేశాను. యాసిడ్ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి. అలాగే ఇంట్లో వాడిపారేసే వస్తువులను, ఆఖరుకు కోడిగుడ్డు పెంకులను కూడా స్కూల్‌కి తెప్పించి వాటితోనే పరిశోధన చేయించేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే సైన్స్‌ని జీవితానికి అన్వయించుకోవడం ఎలాగో నేర్పిస్తాను. కొంతమంది పిల్లలు పుస్తకంలో ఉన్నదానిని క్షుణ్ణంగా మెదడుకు పట్టించుకుంటారు. కానీ తమ ఎదురుగా ఉన్న విషయం మీద అపై్ల చేయడంలో విఫలమవుతుంటారు. నా స్టూడెంట్స్ అలా ఫెయిల్ కారు. దోమలను పారదోలగలిగేది రెడీమేడ్ మస్కిటో రిపెల్లెంట్ మాత్రమే కాదు బంతిచెట్టు కిటికీలో పెట్టినా ఫలితాన్ని పొందవచ్చని నా విద్యార్థులకు తెలుసు. ఫీల్డ్ ఎడ్యుకేషన్‌కి వాటర్ వర్క్స్‌తోపాటు ప్రతి డిపార్ట్‌మెంట్‌కీ తీసుకుని వెళ్తాం. మా స్కూల్ విద్యార్థులు చేసిన ప్రయోగాలు స్టేట్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శితమయ్యాయి. నేషనల్ ఇన్స్పైర్ మనక్‌లో రెండు ప్రాజెక్టులు ప్రదర్శించాం. ఇస్రో సైన్స్ క్విజ్‌లో రెండేళ్లు పాల్గొనడంతోపాటు మా విద్యార్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తక్కువ వనరులున్న పాఠశాల నుంచి పిల్లలను జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్లగలుగుతున్నందుకు గర్వకారణంగా ఉంది. రేడియో ప్రసంగాల్లో ఎక్కువగా మహిళాసాధికారత గురించి మాట్లాడేదాన్ని. అలాగే ఈ పురస్కారాన్ని దేశానికి ఫస్ట్ సిటిజన్ హోదాలో ఉన్న ఒక మహిళ చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది. – రావి అరుణ, ఫిజిక్స్ టీచర్, జిల్లా పరిషత్ పాఠశాల, కానూరు, కృష్ణాజిల్లా – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నడిపూడి కిషోర్ -
‘గురు’తర బాధ్యత మీదే!
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని సంస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పుల అమలు, లక్ష్యాల సాధనలో చదువులు చెప్పే గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా తొలి అడుగులు పడేది వారు చూపించే బాట నుంచేనని గుర్తు చేస్తూ వారిపై ఉంచిన గురుతర బాధ్యతను నెరవేర్చాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతమయ్యేలా టీచర్లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను రూపుమాపి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా పలు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో నిరక్షరాస్యత శాతం జాతీయ సగటును మించి ఉందని, ఐదేళ్లలో ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి నిరక్షరాస్యతను సున్నా స్థాయికి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, వారి వసతి, భోజనాలకు ఏటా రూ.20 వేలు, అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రవేశపెట్టామని చెప్పారు. మూడేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారో వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గురువులకు వందనాలు. నాకు చదువు చెప్పిన ప్రతి గురువు పాదాలకు వందనం చేస్తూ నాలుగు మాటలు చెబుతున్నా. మన తెలుగువారైన మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని దేశమంతా టీచర్స్‌డేగా జరుపుకొంటోంది. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేసి అనంతరం భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప పాఠం. తన జీవితాన్ని మార్చిన గురువును ఏ పిల్లవాడైనా ఎంత ఎదిగినా మరిచిపోలేడు. దీనికొక నిదర్శనం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితమే అని చెప్పవచ్చు. తనకు పాఠాలు చెప్పిన ఒక బీసీ కులానికి చెందిన అధ్యాపకుడు వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో దివంగత నేత ఒక స్కూలును స్థాపించారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇవ్వాళ్టికీ ఆ స్కూలును నడుపుతోంది. గురువు విద్యార్ధుల మనసులపై చెరగని ముద్ర వేస్తారనేందుకు ఇదో నిదర్శనం. గురువు చేసే పని బహుశా ఎవరూ చేయలేరేమో. అందుకనే గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః అని అంటారు. ఈ పరిస్థితులు మారాలి.. మన రాష్ట్రం చదువుల పరంగా ఏ స్థాయిలో ఉందో అంతా ఆలోచన చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యత అక్షరాలా 33 శాతం. అదే జాతీయ సగటు 27 శాతం మాత్రమే. అంటే ఏపీలో నిరక్షరాస్యత జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉంది. దీని అర్థమేమిటో మీరంతా ఆలోచన చేయాలి. వీరంతా చదువుకోవాలనే ఆరాటం లేని వారు కాదు. చదివించాలనే తపన ఉన్నా చదివించలేని పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చి నిరక్షరాస్యతను ఐదేళ్లలో పూర్తిగా సున్నాకు తీసుకురావాలన్నదే నా తాపత్రయం, తపన. ఇదేకాదు.. 18 – 23 సంవత్సరాల వయసు కలిగి ఇంటర్ తరువాత డిగ్రీ చదవాల్సిన పిల్లలు ఎంతమంది కాలేజీల బాట పడుతున్నారని చూస్తే దానిలోనూ వెనుకబడి ఉన్నాం. బ్రిక్స్ (బ్రెజిల్ రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలైన రష్యాలో 81 శాతం, చైనాలో 48 శాతం, బ్రెజిల్లో 50 శాతం మంది పిల్లలు కాలేజీల్లో చేరుతుండగా మన దేశంలో కేవలం 26 శాతమే చేరుతున్నారు. అంటే 74 శాతం మంది పిల్లలు ఇంటర్ దాటి కాలేజీల్లో చదివే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులు మార్చాలి. రష్యాలో 81 శాతం మంది పిల్లలు కాలేజీల్లో చేరుతుంటే దానికన్నా ఎక్కువగా మన రాష్ట్రం ఉండాలన్న తాపత్రయంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి శ్రీకారం చుట్టాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కాలేజీల్లో చదువుకునే పిల్లలకు వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేలు ఇచ్చే పథకాల ద్వారా విద్యారంగ పరిస్థితులను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌కు వీణను అందజేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్. చిత్రంలో మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు పార్థసారథి, మల్లాది విష్ణు మానవత్వం లేని పాలనను పాదయాత్రలో చూశా... నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా గ్రామాల్లో నడుస్తున్నప్పుడు చాలా స్కూళ్లు కనిపించాయి. చాలామంది పిల్లలు, ఉపాధ్యాయులు నా దగ్గరకు వచ్చారు. కొందరు ఉపాధ్యాయులు నాడు ప్రతిపక్షనేతగా ఉన్న నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పినందుకు గత ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. కానీ వాస్తవమేమిటనే ఆలోచన చేయలేదు. పాదయాత్రలో స్కూళ్ల పరిస్థితిని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు నా కంటికి కనిపించాయి. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి 8 నెలలకుపైగా బకాయిలు చెల్లించలేదు. సరుకులు కొనే పరిస్థితి లేదు. ఆయాలకు ఇచ్చే గౌరవ భృతి రూ. వెయ్యి ఇచ్చే పరిస్థితి లేదు. 8 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెడితే వాళ్లు సరుకులు ఏం తీసుకొస్తారు? పిల్లలకు తిండేం పెడతారు? ఆ పిల్లలు ఆ తిండేం తినగలుగుతారు? పిల్లలు చదువుల బాట ఎలా పడతారు? అన్న కనీస ఆలోచన, మానవత్వం లేని పరిపాలనను ఆనాడు చూశాం. స్కూళ్లలో పరిస్థితులు మరీ అధ్యాన్నం. బాత్రూములో నీళ్లుండవు. అవి వినియోగానికి అసలు పనికిరావు. పాఠ్యపుస్తకాలు స్కూళ్లు తెరిచిన జూన్ మొదటి వారానికే అందుబాటులోకి రావాల్సి ఉన్నా అక్టోబర్, నవంబర్‌లో కూడా అందించలేని దుస్థితి. టీచర్లు తక్కువగా ఉన్నారని తెలిసినా నియామకాలు చేయాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. యూనిఫారాల పరిస్థితీ అంతే. ఇవ్వాల్సిన సమయంలో ఏదీ ఇవ్వని దుస్థితి. ఇలా ప్రతి అడుగులో ప్రభుత్వమే పాఠశాలలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తే స్కూళ్లు ఎలా తయారవుతాయో నా పాదయాత్రలో గమనించా. ఇవన్నీ చూసిన తరువాతనే విప్లవాత్మక మార్పులు తెస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. తొలి అడుగులు మీ నుంచే.. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే స్కూళ్ల దశదిశ మార్చేలా ప్రతి స్కూలు ఫొటో తీయాలని చెప్పాం. దశలవారీగా మూడేళ్లలో ప్రతి స్కూలును ఎలా మార్చామో ఫొటోల ద్వారా వ్యత్యాసాన్ని చూపించాలని అధికారులను కోరాం. ఇందుకు కట్టుబడి ఉన్నాం. ప్రతి స్కూలులో మార్పులు చేస్తాం. పేరెంట్ బాడీలను తీసుకువస్తాం. తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియంగా మార్చాలని ఆరాట పడుతున్నాం. పిల్లలకు మంచి చదువులు అందాలి. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు బాగుండాలి. మన పిల్లలను ఏ మోహమాటం లేకుండా ప్రభుత్వ స్కూళ్లకు చిరునవ్వుతో పంపించేలా ఉండాలన్న ఆరాటంతో అందరం ఉన్నాం. ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఆ బృహత్తర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. అయితే ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా తొలి అడుగులు పడేది మీరు చూపించే బాట నుంచే. మీ బాధ్యతలను మరొక్కసారి గుర్తుచేస్తూ దీన్ని గొప్పగా నెరవేరుస్తారని ఆశిస్తూ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు’ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు.. టీచర్స్ డే సందర్భంగా 143 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందచేశారు. ఉత్తమ గురువులకు ట్యాబ్, పతకం, ధ్రువపత్రం, రూ.20 వేల నగదు అవార్డును పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందించింది. విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్ధులకు ఉన్నత విద్య కలను సాకారం చేశారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, పేర్ని నాని, కొడాలి నాని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తన జీవితాన్ని మార్చిన గురువును ఏ పిల్లవాడైనా ఎంత ఎదిగినా మరిచిపోలేడు. దీనికి నిదర్శనం దివంగత నేత వైఎస్సార్ జీవితమే. తనకు పాఠాలు చెప్పిన వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో స్కూలును స్థాపించారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇవ్వాళ్టికీ ఆ స్కూలును నడుపుతోంది. – సీఎం వైఎస్ జగన్ గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు -
గురవే నమహా...
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ తరం సంగీతదర్శకుల్లో ఓ సంచలనం. మరి.. ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురువు ఎవరు? అంటే.. ‘మాండొలిన్ శ్రీనివాస్’. గురువారం టీచర్స్ డేని పురస్కరించుకుని తన గురువు మాండొలిన్ శ్రీనివాస్‌కి ఓ పాట అంకితం ఇచ్చారు. ‘గురవే నమహా...’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన టీచర్స్, మన గురువులు.. మనకు చదువు చెప్పిన వాళ్లు, సంగీతం నేర్పిన వాళ్లు.. ఇలా అందరూ మనకు ముఖ్యం. టీచర్స్ డే సందర్భంగా నా గురువు మేస్ట్రో మాండొలిన్ శ్రీనివాస్‌గారికి ఒక చిన్న నివాళి. ఆయన దగ్గర నేర్చుకున్న మాండొలిన్ నాలెడ్జ్తోటే ఈ పాటను నేను కంపోజ్ చేశా. మీ అందరికీ నచ్చిన పాటే. తన జీవితంలో ఎంతో మంది శిష్యుల్ని సంపాదించుకున్నారాయన. అలాంటి గురువు గొప్పతనం మాటల్లో వర్ణించలేం. అందుకే సంగీతంతో నా భావాలను వ్యక్తం చేశా. నా గురువుకు బాగా ఇష్టమైన రాగాల్లో ఒకటైన కీరవాణి రాగంలో ఈ పాటని కంపోజ్ చేశా. జీవితాలకు అర్థం చెప్పిన ప్రతి గురువుకు ఈ పాట అంకితం’’ అన్నారు. -
‘సీఎం జగన్ విద్యారంగానికి పెద్ద పీట వేశారు’
సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరు జిల్లా పరిషత్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర రేవు ముత్యాలరాజు, డీఈఓ రేణుక పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆళ్లనాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల బడ్జెట్లో విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారని, అమ్మ ఒడి వంటి పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నత వర్గాల పిల్లలతో పోటీగా పేద పిల్లలు చదుకునేందుకు అమ్మ ఒడి ఉద్దేశమని తెలిపారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం రెండు దశల్లో పూర్తి స్థాయిలో అభివృద్థి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఏ నాయకుడు ఇవ్వని విధంగా సీఎం జగన్ విద్యారంగానికి పెద్ద పీట వేశారని కొనియాడారు. తమకు చదువు నేర్పిన ఉపాద్యాయుల వల్లే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పడు అదే గురువులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగుల సమస్యలతో పాటు ఉపాద్యాయుల సమస్యలను సైతం పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. -
అమరావతి : గురుపూజోత్సవంలో పాల్గొన్న వైఎస్ జగన్
-
గురువులను పూజించే గొప్ప సంస్కృతి మనది: సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. విద్య నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉందని శ్లాఘించారు. జాతి నిర్మాణంలో యువత పాత్రను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాగా గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలో జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు ప్రదానం చేస్తారు. India is endued with a great culture of worshipping teachers. Teachers are the ones who sculpt young minds and their role is paramount in nation building. Wishing you all a very #HappyTeachersDay. My tributes to Dr. Sarvepalli RadhaKrishnan on his Jayanti. 🙏 — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2019 -
సేవలకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం విద్యా బోధనలో ఉత్తమ సేవలందిం చిన 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ విగంగాధర్ గౌడ్ మాట్లాడుతూ రెండేళ్లలో 574 రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రారంభించామన్నారు. కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రభు త్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించింది. నగరంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో బోధించడం వల్ల డ్రాపౌట్స్ తగ్గి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. రెండేళ్లలో 574 రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రారంభించామన్నారు. విదేశాల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల విద్యానిధి కింద అందజేస్తుందన్నారు. తల్లిదండ్రులే మొదటి దేవుళ్లని, ఆ తర్వాత స్థానం గురువుకు దక్కుతుందని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. జిల్లా పదోతరగతి ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో నాలుగో స్థానం సాధించగా, అంతకు ముందు 6వ స్థానం వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం మరింత కృషి చేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలబెట్టడానికి ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయులు పాటుపడాలన్నారు. జాతీయస్థాయిలో బోర్గాం పాఠశాలను తీర్చిదిద్ది అవార్డు అందుకుంటున్న హెచ్ఎం రామారావును మిగతా ప్రధానోపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పింస్తోందన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నభోజనం, దుస్తులు, పుస్తకాలు విద్యార్థులకు సమకూరుస్తున్నామని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన అందించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కోరికలకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన ఫలితాలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామన్నారు. మరోవైపు మాతృభాషను మరువకుండా విద్యార్థులకు తర్ఫీదునివ్వాలని సూచించారు. చదువుతోపాటు విద్యార్థులకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ కూడా నేర్పాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి విద్యార్థి కనీససం ఆరు మొక్కలు నాటేలా చూడాలని, హరిత పాఠశాలలుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గురువులంటే ఎంతో గౌరవమని, వారు ఎక్కడ కన్పించినా పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటానని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు. కార్యక్రమంలో డీఈఓ నాంపల్లి రాజేష్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీడీఓ శకుంతల, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇల్తెపు శంకర్, మోహన్‌రెడ్డి, రాజ్‌గంగారెడ్డి, సత్యానంద్, ఓ రమేష్, బీసీటీయూ వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గురువులే మార్గదర్శకులు
ఖమ్మంసహకారనగర్: ఈ సమాజంలో గురువులే మార్గదర్శకులని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. ఉపాధ్యాయులు వృత్తికే వన్నె తీసుకొస్తారని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని తెలిపారు. బుధవారం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. డీఈఓ పి.మదన్మోహన్ అధ్యక్షతన మిగతా జిల్లా వ్యాప్తంగా 29మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలన్నారు. జిల్లాలో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. నూటికినూరు శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయుల బోధన విధానం ఉండాలన్నారు. మరింత నాణ్యమైన, మెరుగైన విద్యను అందించడమే లక్ష్యమన్నారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని, అందుకనుగుణంగా విద్యాశాఖ, ఉపాధ్యాయులు శ్రద్ధ పెంచాలన్నారు. అప్పుడే ఆశించిన లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమర్, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, 7వ డివిజన్ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, ఏడీ మురళీకృష్ణ, ఖమ్మంఅర్బన్ ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు 12నెలల వేతనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈనెలాఖరు నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ పథకానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇకపై ఏటా 12 నెలల వేతనాన్ని ఇస్తామన్నారు. ఇప్పటివరకు పది నెలల వేతనమే ఇచ్చేదని, ఇకపై వారంతా 12 నెలల జీతం అందుకోనున్నట్లు వివరించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ లతో కలసి కడియం శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో 3,728 మంది, డిగ్రీ కాలేజీల్లో 898 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 433 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఆమోదానికి విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అదేవిధంగా కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని వచ్చే ఏడాది నుంచి రూ.25 వేలకు పెంచేందుకు కృషి చేస్తామని శ్రీహరి ప్రకటించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయు లుగా ఎంపికైన∙వారిని మంత్రులు సన్మానించారు. అనంతరం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ రూపొందించిన అనుభవాత్మిక అభ్యసనం– గాంధీజీ నయితాలీమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కాటెపల్లి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తర్వులు జారీ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇకపై ఏడాదిలో 12 నెలలు జీతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఏడాది లో 10 నెలల కాలానికే జీతం చెల్లిస్తుండగా, ఇకపై 12 నెలలూ జీతం చెల్లించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉపాధ్యాయులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న వైఎస్ జగన్
-
ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వైఎస్ జగన్ గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్ జగన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, గుడివాడ అమరనాథ్‌తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో చవితి, టీచర్స్ డే వేడుకలు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయంలో వినాయకచవితి, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురి పార్టీ ముఖ్య నేతలు పాల్గొని గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని నేతలు ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను వైఎస్సార్సీపీ నేతలు సన్మానించారు. ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. -
ముఖ్యమంత్రి సభలో షార్ట్‌సర్క్యూట్
మహారాణిపేట (విశాఖపట్నం) : గురుపూజోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభలో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. అధికారులు అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులతోపాటు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాయంత్రం 4.45 గంటల సమయంలో వేదిక వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు ముందుగా విద్యార్థులను పలకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అయితే అదే సమయంలో వేదిక పక్కనున్న విద్యుత్ తీగల్లో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు, పొగలు వ్యాపించాయి. దీంతో వేదికపైనున్న అధికారులు, పాల్గొన్న విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు వెళ్లి వేదికపై అమర్చిన లైట్లకు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేలా చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా సభా ప్రాంగణంలో మాత్రం చీకట్లు కమ్ముకున్నాయి. ఇదంతా జరిగి విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి రాగా కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించారు. -
'విద్యతోనే గిరిజనుల అభివృద్ధి'
మంచాల (రంగారెడ్డి) : విద్యతోనే గిరిజనులు అభివృద్ధి చెందుతారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రామచంద్రుడు అన్నారు. ఆయన శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని ఐపీఎఫ్ స్కూల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పలు విషయాలు మాట్లాడారు. ఓ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కూల్‌కు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వ అధికారులతో చర్చిస్తానని తెలిపారు. -
మోడీ ప్రసంగానికి మంగళం!
శ్రీకాకుళం సిటీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు తన ‘గురు’ ప్రసంగాన్ని వినిపిద్దామనుకున్న దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షకు జిల్లాలోని పలువురు టీచర్లు ఝలక్ ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మునిగిపోరుు ప్రసంగం గురించేమరచిపోయూరు. శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి 4.45 గంటల వరకు మోడీ ఇచ్చే ప్రసంగం వినేందుకు పలు చోట్ల విద్యార్థులే కనిపించలేదు. ఏర్పాట్లు కూడా చేయలేదు. ఆమదాలవలస మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో విద్యార్థులకు బదులుగా కేవలం మండల, మున్సిపల్ ఉపాధ్యాయులే ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా అక్కడి మండల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చే సారంటే జిల్లాలో మోడీ ప్రసంగ కార్యక్రమం నిర్వహణ తీరు ఏమేరకుందో ఇట్టే అర్ధమవుతోంది. హిందీలో ప్రసంగం కావడంతో విద్యార్థులెవ్వరికీ ప్రసంగ సారాంశం అర్ధం కాలేదు. టీచర్లంతా ఉపాధ్యాయదినోత్సవ వేడుకల్లో మునిగితేలారని, అందుకే ప్రసంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని పేరు చెప్పడం ఇష్టం లేని ఓ విద్యాశాఖాధికారి ‘సాక్షి’కి వివరించారు. ఇదిలావుంటే జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు చోట్ల వర్షం కురియడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇదే విషయూన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి వద్ద ప్రస్తావించగా జిల్లాలో మోడీ ప్రసంగం అన్ని చోట్ల బాగానే జరిగిందని చెప్పుకొచ్చారు. ఆమదాలవలస విషయం ఆమె దృష్టికి తీసుకెళ్లగా, ఎక్కడెక్కడ ఏం జరిగిందో సమీక్షిస్తామన్నారు.