సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వైఎస్ జగన్ గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్ జగన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, గుడివాడ అమరనాథ్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment