వైఎస్సార్సీపీ కార్యాలయంలో చవితి, టీచర్స్ డే వేడుకలు | Ganesh Chaturthi Celebrations At YSRCP Office In Lotus Pond | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ కార్యాలయంలో చవితి, టీచర్స్ డే వేడుకలు

Published Mon, Sep 5 2016 12:30 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

Ganesh Chaturthi Celebrations At YSRCP Office In Lotus Pond

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయంలో వినాయకచవితి, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురి పార్టీ ముఖ్య నేతలు పాల్గొని గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని నేతలు ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను వైఎస్సార్సీపీ నేతలు సన్మానించారు. ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement