సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉంది.
వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. సామాజిక సమీకరాణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల పోటీలో బీసీ సామాజికవర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్ పేర్లను పరిశీలినలో ఉండగా.. ఎస్టీ నుంచి బలరాం నాయక్, ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఓసీ కోటా నుంచి పటేల్ రమేష్ పేరు హైకమాండ్ దృష్టిలో ఉన్నట్టు పార్టీలో వినిపిస్తోంది. మరోవైపు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, జావిద్ అలీఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే, అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment