
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీనియర్ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసింది. దీంతో, వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు.
వివరాల ప్రకారం.. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు వీరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇక, ఈనెల 18వ తేదీన ఎమ్మెల్సీ నామినేషన్లకు ఆఖరు తేదీ. 29న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటంతో వీరి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment