
సాక్షి,హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీకాలం ముగియనుంది. ఏపీలో పదవీకాలం ముగిసే వారిలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఎన్నికల సంఘం మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. మార్చి 10 నామినేషన్ల ప్రక్రియ,మార్చి 11 నామినేషన్ల పరిశీలన,మార్చి 13 నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. మార్చి 20న పోలింగ్ అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment