సాక్షిప్రతినిధి, ఖమ్మం:
పాలక వర్గాల పదవీ కాలం త్వరలోనే ముగియనుండగా.. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సిబ్బందికి సంబంధించిన సమాచారం కోరిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు తగిన కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం జూలైతో ముగియనుంది. వీటికి ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ఆ ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు నెలల క్రితమే ఆయా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో పంచాయతీ అధికారులు అప్పటి నుంచే ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై దృష్టి సారించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే కేబినెట్ మంత్రులతో సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉండటంతో ఈలోపు ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండేందుకు ఉన్నతాధికారులు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు.
దశలవారీ ఎన్నికలపై కసరత్తు
జిల్లాలోని 427 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వం తండాలను జీపీలుగా చేయాలని భావిస్తుండటంతో జిల్లాలో మరో 173 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నింటికీ దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు, ఇందుకోసం చేయా ల్సిన ఏర్పాట్లపై పంచాయతీ అధికారులు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ స్టేషన్లు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడితే ఎక్కడ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.. అనే అంశంపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలు బ్యా లెట్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభు త్వం ఇప్పటికే నిర్ణయించడంతోపాటు ఏయే జిల్లాకు ఎక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు తేవాలో రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, సరిగుప్ప జిల్లాలోని తొమ్మిది తాలూ కాల నుంచి 3,506 బ్యాలెట్ బాక్సులను తెచ్చుకోవాలని, ఇందుకు అవసరమైన రవాణా, ఇతర ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఉన్నతాధికారు లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. వీటితోపాటు జిల్లాలో 427 గ్రామ పంచాయతీల పరిధిలో 4,320 వారు ్డలు ఉన్నాయి. వీటి లో ప్రతి వార్డుకు ఎన్నిక నిర్వహించా ల్సి ఉండటంతో ఆయావార్డుల ఆధారంగా పోలింగ్ సిబ్బంది నియామకానికి సైతం ఎన్నిక ల కమిషన్ ఇప్పటికే జిల్లా అధికారులను వివిధ ప్రభు త్వ శాఖల అధికారులు, ఉద్యోగుల జాబితాను కోరింది. దీంతో జిల్లా పంచా యతీ అధికారులు 52 ప్రభుత్వ శాఖల కు చెందిన అధికారులు, ఉద్యోగుల వి వరాలను సమర్పించారు. ప్రతి పోలి ంగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ క్లర్క్‌లు విధులు నిర్వ హించాల్సి ఉంటుంది. వీటితోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులనుపెద్ద ఎత్తున తరలించనున్నారు.
కొత్త పంచాయతీలకూ..
ప్రభుత్వం తండాలను, ఇతర ప్రాంతాలను కూడా పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా 173 కొత్త పంచాయతీలుగా ఏర్పడేందుకు అవకాశం ఉంది. వీటిలో 1,222 వార్డులుగా ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం డివిజన్ పరిధిలో 14 మండలాలు ఉన్నాయి. వీటిలో 311 గ్రామ పంచాయతీలు 3,144 వార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తగా 121 గ్రామ పంచాయతీలు, 848 వార్డులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కల్లూరు డివిజన్ పరిధిలో మొత్తం 6 మండలాలున్నాయి. వీటిలో 116 గ్రామ పంచాయతీలు, 1,176 వార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తగా 52 గ్రామ పంచాయతీలు, 374 వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అయితే కొత్తగా ఏర్పడనున్న గ్రామ పంచాయతీల్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment