కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మరో 3,600 ఈవీఎంలు శుక్రవారం జిల్లాకు వచ్చాయి. బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వీటిని ఉత్పత్తి చేసింది. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరికొన్ని అనుబంధ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఒకేసారి అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతుండటంతో ఈవీఎంలు ఎక్కువ అవసరమవుతున్నాయి. జిల్లాకు 7,300 కంట్రోల్ యూనిట్లు అవసరం కాగా ఇప్పటి వరకు 6000 వచ్చాయి.
ఇంకా 1,300 కంట్రోల్ యూనిట్లు రావాల్సి ఉంది. 9,200 బ్యాలెట్ యూనిట్లు రావాల్సి ఉండ గా, 3,600 వచ్చాయి. ఇంకా 5,600 బ్యాలెట్ యూనిట్లు రావాల్సి ఉంది. మిగిలిన కంట్రోల్ యూనిట్లు, బ్యా లెట్ యూనిట్లు మూడు నాలుగు రో జులలో పూర్తిస్థాయిలో వచ్చే అవకా శం ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బ్యాలెట్ యూనిట్‌లో తిరస్కరణ ఓటు నోటా బటన్ పెట్టాల్సి రావడంతో ఈవీఎంలను కొత్తగా ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. జిల్లాకు వచ్చిన ఈవీఎంలను కలెక్టరేట్ వెనుక ఉన్న సివిల్ సప్లయ్ గోదాములో ఉంచారు.
బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్..!
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఏప్రిల్ 6, 11 తేదీల్లో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ బాక్సులు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి వచ్చినట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాకు 2,700 బ్యాలెట్ బాక్సులు అవసరమన్నారు.
అయితే ఇప్పటికి 1800 బాక్సులు వచ్చాయని, వీటి లో నంద్యాల డివిజన్‌కు 1000 పంపామని, మిగిలిన 800 బాక్సులను జిల్లా కేంద్రంలోనే ఉంచుతున్నట్లు చెప్పారు. మిగిలిన 900 బాక్సులు కూడా త్వరలో వస్తాయన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ వేగంగా జరుగుతున్నదని చెప్పారు. ముద్రణ పూర్తైనంబరింగ్ వేసిన బ్యాలెట్ పత్రాలను మండలాల వారీగా సీల్ చేసి పంపుతున్నట్లు తెలిపారు.
జిల్లాకు మరో 3,600 ఈవీఎంలు
Published Sat, Mar 29 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM
Advertisement