
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగ సర్వేల ముఠా బయటపడింది. సర్వే పేరుతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న ఇద్దరు యువతులను వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్లలో సర్వే పేరుతో ఇద్దరు యువతులు ఇంటింటికి తిరుగుతూ మీరు ఎవరికి ఓటు వేస్తారో చెప్పాలంటూ ప్రజలను ఆరా తీస్తున్నారు. అనుమానం వచ్చిన వైఎస్సార్‌సీసీ నేతలు ఆ యువతులను నిలదీశారు. భయపడిపోయిన యువతులు మొదట తాము మీడియా ప్రతినిధులమని చెప్పి తర్వాత నీళ్లు నమిలారు. దీంతో ఆ యువతులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనతో పోలీసులకు అప్పగించారు. అప్పగించిన కొద్దిసేపటికే యువతులను పోలీసులు విడిచిపెట్టడం గమనార్హం.