జోగులాంబ: త్వరలో అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన ఘట్టమైన తుదిఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది.
ఇందుకు సంబంధించి ఆగస్టు 21వ తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై మార్పులు, చేర్పులు, 18సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా ఓటుహక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 19వ తేదీ వరకు తుది అవకాశాన్ని కల్పించింది. ఈక్రమంలో ఫాం–6, 7, 8లకు సంబంఽధించి (చేర్పులు, మార్పులు, తొలగింపు)జిల్లా వ్యాప్తంగా 44,963 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు పోలింగ్ స్టేషన్ల వారీగా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి తుదిజాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆగస్టులో ముసాయిదా జాబితా విడుదల..
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఆధారంగా చేసుకుని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో ఆగస్టు 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,78,951మంది ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. ఇందు లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపా రు. వీటిపై ఏమైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదుల చేసుకునేందుకు అదేవిధంగా 18సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 19తేదీ వరకు మరో అవకాశం కల్పించింది.
పెరగనున్న ఓటర్లు..
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 4,78,951 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటరు జాబితా లెక్కలు చెబుతుండగా, వీటిపై మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించి 44,963 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన వాటిని ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య కంటే మరికొంత మేర ఓటర్ల సంఖ్య పెరగనుంది. జాబితాను ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రకారం ఈనెల 4వ తేదీన విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది.
మొత్తం 44,963 దరఖాస్తులు!
ముసాయిదా ఓటరు జాబితాపై చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఫాం–6, 7, 8 కింద జిల్లా వ్యాప్తంగా 44,963 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గద్వాల నియోజకవర్గంలో ఫాం–6కి 13,746, ఫాం–7కి 7,800, ఫాం–8కి 8450 దరఖాస్తులు, అలంపూర్ నియోజకవర్గ పరిధి లో ఫాం–6కి 8,432, ఫాం–7కి 3,001, ఫాం–8కి 3,531 దరఖాస్తులు వచ్చినట్లు తె లిపారు. వీటన్నింటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న 593పోలింగ్ స్టేషన్లలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.
ప్రతి దరఖాస్తును పరిశీలించాం..
ముసాయిదా జాబితాపై ఫాం–6,7,8లకు సంబంఽధించి వచ్చిన దరఖాస్తులను పోలింగ్ స్టేషన్ల వారిగా సందర్శించి పరిశీలించడం జరిగింది. తుది ఓటరు జాబితాను ఈనెల 4వ తేదీన విడుదల చేస్తాం. – వల్లూరు క్రాంతి, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment