సాక్షి, హైదరాబాద్ : ఎండ చండప్రచండమై మండుతోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో ఓవైపు జనం పిట్టల్లా రాలిపోతుండగా.. మరోవైపు వాహనాలు కూడా నిప్పుల్లో కలిసిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనం వద్ద ఆమనగల్ నుంచి షాద్‌నగర్ వైపు అట్టల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిండా అట్టలు ఉండటంతో క్షణాల్లో మంటలు వాహనమంతా వ్యాపించాయి. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనం దిగి ప్రాణాలు నిలుపుకున్నారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. అయితే, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం జరిగింది. ఇక అదే రోజు కోదాడ మండలం తోగర్రాయి వద్ద కూడా ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ప్రయాణికులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు
Comments
Please login to add a commentAdd a comment