ఘోర అగ్నిప్రమాదం: 350 బైక్‌లు దగ్ధం | 350 bikes fired at shadnagar | Sakshi
Sakshi News home page

ఘోర అగ్నిప్రమాదం: 350 బైక్‌లు దగ్ధం

Published Sat, Mar 18 2017 6:55 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

350 bikes fired at shadnagar

షాదన్‌గర్‌: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండులోని తుల్జా భవాని, లక్ష్మీనరసింహ బైక్‌ పార్కింగ్‌ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 350 బైక్‌లు పూర్తిగా కాలిపోయాయని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో గతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండేది.  ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెను తొలగించేందుకు గ్యాస్‌ కట్టర్‌ ఉపయోగిస్తుండగా నిప్పు రవ్వలు పడి అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం. మొత్తం బైక్‌లు ఎన్ని తగులబడ్డాయో ఇంకా లెక్కింపు  పూర్తికాలేదు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement