మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. వెంటనే ప్రయాణికులను బస్సులో నుంచి స్థానికుల సహయంతో కిందకి దింపేశారు. అనంతరం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది... బస్సులో చెలరేగిన మంటలార్పివేశారు. ప్రయాణికుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.