Bike and bus accident
-
పరీక్షకు వెళుతూ.. మృత్యు ఒడికి
సాక్షి, రాయచోటి టౌన్ : చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలోని మల్లూరమ్మ తిరునాలకోసం బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లూరు మండలం నాగిరెడ్డి గారిపల్లెకు చెందిన ఎం. ఓబుల్‌రెడ్డి (48) గురువారం రాత్రి జరిగే తిరునాలకోసం బుధవారం మల్లూరుకు వచ్చారు. అదేరోజున తన తోడల్లుడి కుమార్తె భార్గవి, అల్లుడు మహేశ్వరరెడ్డి కూడా గుర్రంకొండ నుంచి వచ్చారు. భార్గవి డిగ్రీఫైనల్ ఇయర్ చదువుతోంది. గురువారం రాయచోటిలో పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో భార్గవి భర్త ద్విచక్రవాహనం కావాలని, తన భార్యను పరీక్షకు తీసుకెళ్లాలని మామ ఓబుల్‌రెడ్డిని అడిగారు. అయితే తనకు కూడా రాయచోటిలో పని ఉందని, పరీక్ష కేంద్రానికి నేను తీసుకెళతానని చెప్పి కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రాయచోటి సమీపంలోని ఏజీ గార్డెన్ మలుపువద్దకు రాగానే కడప నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఓబుల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భార్గవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
అక్కపెళ్లి చూడకుండానే అనంతలోకాలకు..
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్) : అక్కపెళ్లికి అవసరమైన డబ్బుల కోసం నిజామాబాద్‌కు వచ్చిన త మ్ముడు పెళ్లి చూడకుండానే అనంతలోకానికి వెళ్లాడు. వివరాలు.. జక్రాన్‌పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బానోత్ జీవన్ సుజాతకు ఇద్దరు కుమారులు. జీవన్ తన అన్న కూతురి పెళ్లి ఈనెల 9న జరుగవలసి ఉంది. పెళ్లికి డబ్బులు అవసరం ఉండటంతో జీవన్ తన కొడుకు అరవింద్(18)ను నిజామాబాద్‌కు వెళ్లి డబ్బు లు తీసుకురావాలని చెప్పాడు. అరవింద్ ఆర్మూర్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తనకు తోడుగా అరవింద్ దగ్గరి బంధువైన బాదవత్ వినోద్‌ను బైక్‌పై ఎక్కించుకుని నిజామాబాద్‌కు బయలుదేరారు. అనంతరం బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసుకుని తిరిగి పడకల్ తండాకు బయలుదేరారు. వీరి బైక్ నగరంలోని వినాయక్‌నగర్‌కు రాగానే కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు వస్తున్న కామారెడ్డి డిపోకు చెందిన టీఎస్ 17 టీ 2727 నంబరు గల ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అరవింద్ అక్కడికక్కడే మృతిచెందగా వినోద్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతుడి తండ్రి జీవన్ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. -
బస్సును ఢీకొన్న బైక్: బస్సులో మంటలు
-
బస్సును ఢీకొన్న బైక్: బస్సులో మంటలు
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. వెంటనే ప్రయాణికులను బస్సులో నుంచి స్థానికుల సహయంతో కిందకి దింపేశారు. అనంతరం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది... బస్సులో చెలరేగిన మంటలార్పివేశారు. ప్రయాణికుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.