అక్రమ బంగారు బిస్కెట్ల పట్టివేత | Police Arrested Illegal Gold Biscuit Mafia At Shadnagar | Sakshi
Sakshi News home page

అక్రమ బంగారు బిస్కెట్ల పట్టివేత

Published Wed, Feb 26 2020 2:56 AM | Last Updated on Wed, Feb 26 2020 5:06 AM

Police Arrested Illegal Gold Biscuit Mafia At Shadnagar  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు మరో అక్రమ బంగారం రవాణాను భగ్నం చేశారు. బంగారం అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు సోమవారం షాద్‌నగర్‌ సమీపంలోని చిలకమర్రి గ్రామ సమీపంలోని రాయికల్‌ టోల్‌గేట్‌ వద్ద ఓ ప్రైవేటు క్యాబ్‌ను ఆపారు. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 3,099 గ్రాముల బరువున్న 31 విదేశీ బంగారు బిస్కెట్లు లభించాయి. ఎలాంటి రసీదులు లేకుండా తరలిస్తున్న ఆ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకొని నిందితులని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ రూ. 1.38 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement