షాద్ నగర్ లో కాల్పులు, నయీమ్ హతం
షాద్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మిలీనియం టౌన్ షిప్ లో కాల్పుల కలకలం రేగింది. గ్రేహౌండ్స్ పోలీసుల కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమయ్యాడు. నయీమ్ నక్కిన ఇంటిని ఈ తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నయీమ్ హతమయ్యాడు.
మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్థన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీమ్ నిందితుడు. నల్లగొండ జిల్లా భువనగిరి నయీమ్ స్వస్థలం. గత కొంతకాలంగా అతడు షాద్ నగర్ లో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. అతడిపై 100పైగా కేసులున్నాయి.