
నయీం కేసులో మరో వ్యక్తి అరెస్ట్
రామన్నపేట: ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరొ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన బాలకృష్ణను ఆదివారం యాదగిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నయీంతో కలిసి పలు సెటిల్‌మెంట్లలో పాలు పంచుకున్న బాలకృష్ణ నుంచి కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.