గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో ఒక వ్యాపారవేత్తను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో ఒక వ్యాపారవేత్తను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన నగేష్(20) అనే యువకుడు నయీమ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తినంటూ ఒక వ్యాపార వేత్త పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించి రూ.1 కోటి డిమాండ్ చేశాడు.
మొదటి విడతగా రూ.5లక్షలను ఇచ్చేందుకు అంగీకరించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు వలపన్ని నగేష్‌ను గురువారం ఉదయం పట్టుకున్నారు. ఠాణాకు తరలించి అతడిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.